Top 10 Telugu News: శుభోదయం..ఇవాళ్టీ telugu.asianetnews టాప్ 10 తెలుగు వార్తలలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక.. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు భారీ జరిమానా.,YCP List: వైసీపీ 9వ జాబితా విడుదల.. , జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరేనా..? , జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు.. , నిమిషం నిబంధన ఎత్తివేత , ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్.. తెలంగాణలో మళ్లీ రైతు బీమా, తెలంగాణలో మళ్లీ రైతు బీమా, కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్, పొలిటికల్ ఎంట్రీపై యువీ క్లారిటీ..! ,PKL 10 Final: ఛాంపియన్ గా పుణెరి పల్టాన్.. వంటి వార్తల సమాహారం.
Top 10 Telugu News: (పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక..
Election Commission: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం(ఈసీ) కీలక సూచనలు జారీ చేసింది. వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. కులం, మతం, భాష, ఇతర అనేక మార్గాల్లో ఓట్లను అడగొద్దని, భక్తులు, దైవ సంబంధ విషయాలను అవమానించవద్దని సూచించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ తెలిపింది.
పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు భారీ జరిమానా.
paytm payment bank: పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై భారీ జరిమానా పడింది. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన కొన్ని సంస్థలు ఇందులో ఖాతాలు నిర్వహిస్తున్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూ. 5.49 కోట్ల జరిమానా వేసింది. పలు సంస్థలు గ్యాంబ్లింగ్ సహా ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాయి. అవి పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో ఖాతాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై సమీక్షను ప్రారంభించింది.
YCP List: వైసీపీ 9వ జాబితా విడుదల..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంటున్నది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికను ఆచితూచీ చేపడుతున్నది. ముందస్తుగా ఇంచార్జీలను ప్రకటిస్తున్నది. దాదాపు వారే అభ్యర్థులని ఇటీవలే సీఎం జగన్ వెల్లడించారు. అయినా.. అవసరమైన చోట ఇంచార్జీలను మార్చడానికి వెనుకాడటం లేదు. తాజాగా విడుదలైన తొమ్మిదో జాబితాలో ఈ మార్పు కనిపించింది.
జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల ప్రకటన పోటాపోటీగా జరుగుతున్నది. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే సీట్ల పంపకాలపై ఓ అవగాహనకు వచ్చాయి. అభ్యర్థుల ప్రకటన కూడా షురూ అయింది. కానీ, ఈ కూటమిలో బీజేపీ పాత్ర ఏమిటీ అనేదే ఇప్పటికీ తేలని అంశంగా ఉన్నది. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందా? లేదా? అసలు.. టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ షాక్ ఇస్తుందా? అనే అనుమానాలూ ఉన్నాయి. ఎందుకంటే.. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ప్రకటన వరకూ టీడీపీ, జనసేనల వ్యవహారం వెళ్లింది. కానీ, బీజేపీ గురించి ప్రకటన లేదు. కమల దళం కూడా ఈ పరిణామం పై స్పందించనేలేదు.
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా సాదన కోసం ఆయన ఈ రోజు సీఎం నివాసం ముట్టడికి పిలుపు ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడికి బయల్దేరగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
Telangana Inter Board: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ టైమ్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు.
ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్..
Elevated Corridors: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. హైదరాబాద్‌లోని రక్షణ భూముల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ శుక్రవారం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారితో పాటు హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి వెంట ట్రాఫిక్ ఇక్కట్టు తొలిగించేలా ఎలివేటెడ్ కారిడార్‌ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి తెలిపింది.
CM Revanth: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలోకి తిరిగి తెలంగాణ ప్రభుత్వం చేరుతుందని పేర్కొన్నారు.
కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం నాడు హైద్రాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేద్దాం... సిరిసిల్ల నుండి పోటీ చేద్దామని కేటీఆర్ ను కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సిరిసిల్లలో కేటీఆర్ చేతిలో తాను ఓటమి పాలైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఒకవేళ తన చేతిలో కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసివేయాలని ఆయన సవాల్ విసిరారు.
పొలిటికల్ ఎంట్రీపై యువీ క్లారిటీ..!
Lok Sabha Elections 2024: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, సిక్సర్ కింగ్‌గా పేరుగాంచిన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారనీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తొలిసారి స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు.
PKL 10 Final: ఛాంపియన్ గా పుణెరి పల్టాన్..
Pro Kabaddi League 2024: ప్రో కబడ్డీ లీగ్ 2024 సీజన్ 10 లీగ్ దశల్లో 96 పాయింట్లతో ఆధిపత్యం చెలాయించిన పుణెరి పల్టాన్ ఫైనల్లోనూ తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగించింది. హర్యానా స్టీలర్స్ ను మట్టికరిపించి పీకేఎల్ సీజన్ 10 ఛాంపియన్ గా పుణెరి పల్టన్ నిలిచింది. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో హర్యానాపై 28-25తో పుణెరి పల్టన్ చారిత్రాత్మక విజయం సాధించడంలో పంకజ్ మోహితే, మోహిత్ గోయత్ కీలక పాత్ర పోషించింది.