మణిపూర్ లో మితిమీరిన నిరసనకారుల ఆగడాలు.. అంబులెన్స్ కు నిప్పుపెట్టడంతో ఏడేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

By Asianet NewsFirst Published Jun 7, 2023, 2:22 PM IST
Highlights

మణిపూర్ లో నిరసనకారులు తీవ్ర హింసకు పాల్పడుతున్నారు. సాధారణ పౌరులను కూడా హతమారుస్తున్నారు. ఓ శిబిరంలో రక్షణ పొందుతున్న సమయంలో కాల్పులు జరగడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వారిని హాస్పిటల్ కు అంబులెన్స్ లో తరలిస్తుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దానిని అడ్డుకొని తగులబెట్టారు. దీంతో క్షతగాత్రులు చనిపోయారు.

మణిపూర్ లో రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ ఇంకా తగ్గడం లేదు. ఆందోళనకారుల ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేయడం, తగులబెట్టడంతో పాటు భద్రతా బలగాలపై కూడా దాడులకు పాల్పడుతున్నాడు. మంగళవారం ఓ బీఎస్ఎఫ్ జవాన్ ను కుకీ వర్గానికి చెందిన ఆందోళనకారులు కాల్చి చంపారు. అయితే అదే రాష్ట్రంలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీలో దారుణం.. చెక్క పెట్టెలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితి మృతి

ఇంఫాల్ వెస్ట్ లోని ఇరోసెంబా ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ శిబిరంలో ఆదివారం (జూన్ 4వ తేదీ) సాయంత్రం ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమయంలో శిబిరంలో తలదాచుకుంటున్న ఓ గిరిజనుడు కుమారైన టాన్సింగ్ హ్యాంగ్సింగ్ (8), అతడి తల్లి మీనా హాంగ్సింగ్ (45), వారి పొరుగున ఉన్న లిడియా లౌరెంబామ్గా కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. 

violence: 3 including a 7 year old killed as mob sets ambulance on fire pic.twitter.com/eDBZAu6qxz

— IDU (@defencealerts)

దీంతో అస్సాం రైఫిల్స్ సీనియర్ అధికారి ఒకరు వెంటనే ఇంఫాల్ లోని పోలీసులతో మాట్లాడి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. తల్లి మెజారిటీ సామాజిక వర్గానికి చెందినది కావడంతో రోడ్డు మార్గం ద్వారా చిన్నారిని ఇంఫాల్ లోని రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ అంబులెన్స్ కు కొన్ని కిలో మీటర్ల పాటు అస్సాం రైఫిల్స్ ఎస్కార్ట్ అందించింది. తరువాత స్థానిక పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

దళిత విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారం.. నెలల తరబడి అఘాయిత్యం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

అయితే సాయంత్రం 6.30 గంటల సమయంలో అంబులెన్స్ లో కుకీ మిలిటెంట్లను తరలిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో అంబులెన్స్ ను ఐసోయిసెంబా వద్ద పౌరులు అడ్డుకున్నారు. పోలీసుల కాన్వాయ్ ను కూడా ధ్వంసం చేసి అంబులెన్స్ ను తగులబెట్టారు. కాంగ్చుప్ ప్రాంతంలో అనేక కుకి గ్రామాలు ఉన్నాయి. కాంగ్పోక్పి జిల్లా ఇంఫాల్ వెస్ట్ తో సరిహద్దులో ఉంది. ఇది ఫాయెంగ్ లోని మెయిటీ గ్రామానికి సమీపంలో ఉంది. కాగా.. ఈ ఘటన జరిగిన వెంటనే శిబిరం, చుట్టుపక్కల భద్రతను పెంచారు.

ముస్లింతో లేచిపోయిన యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించి మనసు మార్చిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ట్విస్ట్ ఏంటంటే ?

ఇదిలా ఉండగా.. మే 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సెకండ్ వేవ్ హింసాకాండలో ఈ ప్రాంతంలో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మీతీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా మే 3న కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ మార్చ్ నిర్వహించిన తరువాత ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలకు ముందు కుకి గ్రామస్తులను రిజర్వ్ ఫారెస్ట్ భూమి నుండి ఖాళీ చేయించడంపై ఉద్రిక్తత ఏర్పడింది. ఇది వరుస ఆందోళనలకు దారితీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు, నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం మంది కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.

click me!