బీజేపీలో చేరాలని బలవంత పెడుతున్నారు - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

By Sairam IndurFirst Published Feb 4, 2024, 3:47 PM IST
Highlights

బీజేపీ (BJP)తనను పార్టీలోకి చేరాలని బలవంతం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAM ADMI PARTY)అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind kejriwal) అన్నారు. కానీ ఆ పార్టీలో తాను చేరబోనని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన బడ్జెట్ లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తోందని ఆరోపించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బలవంతంగా కాషాయ పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కానీ తాను ఆ పార్టీలో చేరబోతనని స్పష్టం చేశారు. ఢిల్లీలోని రోహిణిలో పాఠశాలకు శంకుస్థాపన చేసిన అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

వామ్మో.. మూడేళ్లుగా ఇండియన్ ఎంబసీలో ఐఎస్ఐ ఏజెంట్ విధులు.. చివరికి..

Latest Videos

‘‘వారు (బీజేపీ) మాపై ఎలాంటి కుట్రనైనా చేయవచ్చు. నేను కూడా దృఢంగా ఉన్నాను. నేను వంగను. బీజేపీలో చేరమని అడుగుతున్నారు.్కానీ నేను ఎప్పటికీ బీజేపీలోకి వెళ్లును. ఆ పార్టీలో చేరను.’’ అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం జాతీయ బడ్జెట్లో 4 శాతం మాత్రమే పాఠశాలలు, ఆసుపత్రుల కోసం ఖర్చు చేస్తుందని విమర్శించారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం తన బడ్జెట్లో 40 శాతం వీటి కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు.

పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా.. కారణమేంటంటే ?

ఈ సందర్భంగా జైలులో ఉన్న ఆప్ సహచరులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ గురించి కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావించారు. ‘‘ఈరోజు అన్ని ఏజెన్సీలు మా వెంటే ఉన్నాయి. మంచి పాఠశాలలు నిర్మించడమే మనీష్ సిసోడియా చేసిన తప్పు. అలాగే మంచి హాస్పిటల్స్, మొహల్లా క్లినిక్ లు నిర్మించి సత్యేంద్ర జైన్ తప్పు చేశారు. ఒక వేళ సిసోడియా పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేసి ఉండకపోతే, అతడిని అరెస్ట్ చేసే వారు కాదు.. వారు అన్ని రకాల కుట్రలు సృష్టించారు, కానీ మమ్మల్ని అడ్డుకోలేకపోయారు’’ అని కేజ్రీవాల్ అన్నారు. 

ఔరంగజేబు మథుర శ్రీకృష్ణ దేవాలయాన్ని కూలగొట్టాడు - ఆగ్రా పురావాస్తు శాఖ

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తనపై ప్రేమ, ఆశీస్సులు కురిపించాలని కోరారు. ఇంకేది అందుకోవడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. బీజేపీ.. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేసినందుకు ఢిల్లీ పోలీసులు ఆదివారం మంత్రి అతిషి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘ఫర్జీ’ చూసి స్పూర్తి పొంది నకిలీ నోట్లు ప్రింట్.. అనుకోకుండా పోలీసులకు చిక్కి.. చివరికి

కాగా.. మంత్రి అతిషి కంటే ముందు కేజ్రీవాల్ కూడా ఎమ్మెల్యేల వేట ఆరోపణలు చేశారు. అందుకే దీనిపై ఆయనకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించారు. ఐదు గంటల హైడ్రామా తరువాత ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ముఖ్యమంత్రికి నోటీసును అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ ఆరోపణలపై విచారణలో పాల్గొనాలని, బీజేపీని సంప్రదించిన ఆప్ ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు కోరారు.

click me!