వామ్మో.. మూడేళ్లుగా ఇండియన్ ఎంబసీలో ఐఎస్ఐ ఏజెంట్ విధులు.. చివరికి..

By Sairam Indur  |  First Published Feb 4, 2024, 1:36 PM IST

2021 నుంచి మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో విధులు నిర్వహిస్తున్న పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ను యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వ్దద నుంచి  2 మొబైల్ ఫోన్లు, 1 ఆధార్ కార్డు, పాన్ కార్డు, గుర్తింపు కార్డు స్వాధీనం చేసుకున్నారు.


ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. సత్యేంద్ర సివాల్ అనే నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో మూడేళ్లు పని చేశాడు. అయితే భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పొందడానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హ్యాండ్లర్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్యోగులను డబ్బులతో ప్రలోభపెడుతున్నారని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) కు సమాచారం అందింది.

పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా.. కారణమేంటంటే ?

Latest Videos

దీంతో ఇంటెలిజెన్స్ ఆధారంగా రంగంలోకి దిగిన యూపీ ఏటీఎస్ సత్యేంద్ర సివాల్ ను ఐఎస్ఐ ఏజెంట్ గా గుర్తించింది. హాపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని షామహియుద్దీన్ పూర్ గ్రామానికి చెందిన జైవీర్ సింగ్ కుమారుడు సివాల్ అని పోలీసులు కనుగొన్నారు. నిందితుడి అరెస్టు చేసి 2 మొబైల్ ఫోన్లు, 1 ఆధార్ కార్డు, పాన్ కార్డు, గుర్తింపు కార్డు, రూ.600 నగదును ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది.

ఇకపై టీఎస్ స్థానంలో టీజీ.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం..

ఎలక్ట్రానిక్, ఫిజికల్ సర్వైలెన్స్ ద్వారా జరిపిన దర్యాప్తులో సివాల్ ఐఎస్ఐ హ్యాండ్లర్ల నెట్ వర్క్ తో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత సైనిక సంస్థల వ్యూహాత్మక కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్యమైన రహస్య సమాచారాన్ని డబ్బు కోసం వారికి అందుబాటులో ఉంచుతున్నాడని ఏటీఎస్ గుర్తించింది.

‘ఫర్జీ’ చూసి స్పూర్తి పొంది నకిలీ నోట్లు ప్రింట్.. అనుకోకుండా పోలీసులకు చిక్కి.. చివరికి

సివాల్ ను మీరట్ లోని ఏటీఎస్ ఫీల్డ్ యూనిట్ కు పిలిపించి నిబంధనల ప్రకారం విచారించారు. సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేకపోయాడు. అయితే విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.  భారత సైన్యం గురించి, దాని రోజువారీ కార్యకలాపాల గురించి సమాచారం సేకరించడానికి తాను భారత ప్రభుత్వ అధికారులకు డబ్బుతో లంచం ఇచ్చేవాడినని సివాల్ ఏటీఎస్ విచారణలో వెల్లడించాడు. భారత రాయబార కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన, గోప్యమైన సమాచారాన్ని ఐఎస్ఐ హ్యాండ్లర్లకు చేరవేశాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 

ఔరంగజేబు మథుర శ్రీకృష్ణ దేవాలయాన్ని కూలగొట్టాడు - ఆగ్రా పురావాస్తు శాఖ

దీంతో అతడిపై రష్యాలోని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో 2021 నుంచి ఐబీఎస్ఏ (ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్)గా పనిచేస్తున్న సివాల్ పై ఐపీసీ సెక్షన్ 121ఏ (దేశంపై యుద్ధం చేయడం), అధికారిక రహస్యాల చట్టం 1923 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 

click me!