కోర్టులపై తీవ్ర భారం పడుతోంది - సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్

By team teluguFirst Published Aug 20, 2022, 5:10 PM IST
Highlights

పెండింగ్ కేసుల వల్ల న్యాయ స్థానాలపై తీవ్ర భారం పడుతోందని జస్టిస్ డీ వై చంద్రచూడ్ అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చట్టం ద్వారా మధ్యవర్తిత్వం మంచి వేదిక అని తెలిపారు.

భారతదేశంలోని న్యాయస్థానాలు అత్యంత భారంతో కొనసాగుతున్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కేసులు ప్రమాదకర స్థాయిలో పెండింగ్ లో పడుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి మధ్యవర్తిత్వం వంటి వివాద ర‌హిత పరిష్కార విధానం ఒక ముఖ్యమైన సాధనమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇండియన్ లా సొసైటీ వందేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఐఎల్‌ఎస్ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ (ఐఎల్‌ఎస్‌సీఏ)ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

కొత్త కార్లు కొనుగోలు చేయొద్దు.. ఎవర్నీ కాళ్లు మొక్క‌నివ్వొద్దు - ఆర్జేడీ మంత్రుల‌కు తేజ‌స్వీ యాద‌వ్ సూచన

‘‘ భారతదేశంలో న్యాయస్థానాలు చాలా భారంగా ఉన్నాయని, చాలా రద్దీగా ఉన్నాయని మాకు తెలుసు. PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ చేసిన అధ్యయనం ప్రకారం 2010, 2020 మధ్య అన్ని కోర్టులలో పెండింగ్‌లు ఏటా 2.8 శాతం పెరిగాయి ’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. గత రెండు సంవత్సరాలలో కరోనా మహమ్మారి వల్ల కేసులు భయంకరంగా పెండింగ్ లో పడ్డాయని తెలిపారు. జిల్లా, తాలూకా కోర్టుల్లో 4.1 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వివిధ హైకోర్టుల్లో దాదాపు 59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అందుబాటులో ఉన్న డేటా సూచిస్తోందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

‘‘ నేటి నాటికి, సుప్రీంకోర్టులో 71,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందువల్ల మధ్యవర్తిత్వం ద్వారా, చట్టం అధికారిక విధానపరమైన పద్దతుల ద్వారా  వివాదాలకు పరిష్కారం అందించడం న్యాయం పొందడంలో ముఖ్యమైన సాధనం. ’’ అని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను సంతరించుకుందనడంలో ఎలాంటి సందేహ‌మూ లేద‌ని అన్నారు. భార‌త పార్లమెంటులో 2021 మధ్యవర్తిత్వ బిల్లును ప్రవేశపెట్టార‌ని గుర్తు చేశారు. 

ఇండియాలో టమాట ఫ్లూ ముప్పు.. వేగంగా వ్యాపించే సామర్థ్యం: హెచ్చరించిన లాన్సెట్

‘‘ బిల్‌లోని నిబంధనలపై నేను వ్యాఖ్యానించదలచుకోనప్పటికీ, బిల్లులోని నిబంధనలపై అభిప్రాయాలు, వివిధ వాటాదారుల స్పందన, వివాద పరిష్కార పద్ధతిగా మధ్యవర్తిత్వానికి ఒక యక్త వయస్సు వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. మధ్యవర్తిత్వంపై సింగపూర్ కన్వెన్షన్‌కు సంతకం చేసిన మొదటి గ్రూప్ లో భారత్ ఒకటి గా మారింది.’’ అని ఆయన అన్నారు. ఈ సంద‌ర్భంగా జస్టిస్ చంద్రచూడ్ తన తండ్రి, దివంగ‌త మాజీ CJI జస్టిస్ Y V చంద్రచూడ్ తో తనకు ఉన్న మ‌ధుర‌మైన జ్ఞాపకాలను పంచుకున్నారు. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో సాయుధ బలగాల ట్రిబ్యునల్ పనితీరుపై జరిగిన సెమినార్‌లో న్యాయ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడారు. ఒక న్యాయమూర్తి 50 కేసులను పరిష్కరిస్తే, 100 కొత్త వ్యాజ్యాలు దాఖలయ్యాయని చెప్పారు. ప్రజలు ఇప్పుడు న్యాయంపై మరింత అవగాహన కలిగి ఉన్నార‌ని, వివాదాలను పరిష్కరించుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లను తగ్గించేందుకు ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుందని అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పోస్టుకు రాహుల్ గాంధీ ‘నో’.. ప్రియాంక గాంధీకి బాధ్యతలు?

కాగా.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఒక ప్రశ్నకు రిజుజు స‌మాధానం ఇస్తూ దేశవ్యాప్తంగా 4.83 కోట్ల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఇందులో దిగువ కోర్టుల్లోనే 4 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, సుప్రీంకోర్టులో 72,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 

click me!