అనుమానస్పదంగా ద‌ళిత మైన‌ర్ బాలిక మృతి.. అత్యాచారం చేసి హ‌త్య చేశార‌ని కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌..

By team teluguFirst Published Sep 19, 2022, 2:51 PM IST
Highlights

ఓ దళిత మైనర్ బాలిక అనుమానస్పదంగా చనిపోయింది. అయితే ఆమెపై పలువురు అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా ఫైజ్‌గంజ్ బెహతా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ వెనుక అటవీప్రాంతంలో దళిత మైనర్ బాలిక మృతదేహాన్నిశ‌నివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమెపై అత్యాచారం చేసిన అనంత‌రం హత్య చేసి ఉంటార‌ని ఆ బాలిక కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక మృత‌దేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించామ‌ని, దాని నివేదిక వ‌చ్చిన త‌రువాతే వాస్త‌వాలు ఏంటో తెలుతాయ‌ని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ తెలిపారు.

రానున్న మూడు రోజులు తెలంగాణ, ఏపీ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ

బాధిత కుటుంబ స‌భ్యులు ఏం చెబుతున్నారంటే ? 
త‌మ బిడ్డ చ‌నిపోయిందని తెలిసి ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్తే.. అంత‌కు ముందే త‌మ‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా మృత‌దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తీసుకెళ్లార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక దుస్తుల ప‌రిస్థితి చూసిన త‌రువాత అత్యాచారం జ‌రిగిన‌ట్టు త‌మ‌కు అనుమానం వ‌స్తోంద‌ని బాలిక త‌ల్లి చెప్పారు. ‘‘ మా కుమార్తె ప్రమాదానికి గురైందని, మృతదేహాన్ని గుర్తించడానికి రావాలని ఓ పోలీసు అధికారి మాకు చెప్పారు. మా గ్రామం నుండి ఘటన జరిగిన ప్రదేశం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే మేము వేళ్లే స‌రికే పోలీసులు సంఘటన స్థలం నుండి అన్ని ఆధారాలను చెరిపివేశారు’’ అని మృతురాలి మామ ‘పీటీఐ’కి వివ‌రించారు.

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. ఐటీ కంపెనీలు, బిల్డర్ల ఇళ్లలో కొనసాగుతున్న తనిఖీలు!

తమ కూతురుపై పోలీసు సిబ్బంది, బ్యాంకు గార్డుతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఆరోపించారు. అనంత‌రం హ‌త్య చేశార‌ని చెప్పారు. ఈ కుట్ర‌లో పోలీసు, బ్యాంకు బయట విధులు నిర్వహిస్తున్న గార్డుల ప్రమేయం ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బాలిక‌పై గ్యాంగ్ రేప్.. ఆపై నిప్పంటించిన దుర్మార్గులు.. ప్రాణాల‌తో పోరాడుతూ బాధితురాలు మృతి

దీనిపై సమాచారం అందుకున్న సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఓపీ సింగ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, బాధ్యుల‌పై చ‌ట్ట‌రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహిస్తోందని, మొత్తం పరీక్ష ప్రక్రియను వీడియోగ్రఫీ కూడా చేస్తామని ఆయన చెప్పారు. తుది నివేదిక అధారంగా అవసరం అయితే నిందితులపై మరిన్ని సెక్షన్లను విధిస్తామని చెప్పారు. ఇందులో ప్రమేయం ఉన్న వారిని అరెస్టు చేస్తామని అన్నారు. 
 

click me!