Asianet News TeluguAsianet News Telugu

బాలిక‌పై గ్యాంగ్ రేప్.. ఆపై నిప్పంటించిన దుర్మార్గులు.. ప్రాణాల‌తో పోరాడుతూ బాధితురాలు మృతి

Dalit girl gang-raped: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని పిలిభిత్‌లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆపై ప్రాణాలు తీసేందుకు నిప్పుపెట్టారు. ఈ క్ర‌మంలోనే బాధితురాలు ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతూ సోమ‌వారం నాడు మ‌ర‌ణించింది. 
 

Uttar Pradesh: Two men who gang-raped Dalit   girl and set her on fire; victim died.
Author
First Published Sep 19, 2022, 12:38 PM IST

Uttar Pradesh’s Pilibhit: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆపై నిప్పంటించారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు బాధితురాలు ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతున్న క్రమంలో సోమ‌వారం నాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. లక్నోలో పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని పిలిభిత్‌లోని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదుచేసుకునీ, ద‌ర్యాప్తులో భాగంగా ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల ప్రారంభంలో కున్వర్‌పూర్ గ్రామంలో జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన అనంతరం నిందితులు డీజిల్‌ పోసి నిప్పంటించారు. బాధితురాలు లక్నోలోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూనే ఉంది, కానీ 12 రోజుల తర్వాత మరణించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నోలో పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని పిలిభిత్‌లోని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి నిప్పంటించారని పోలీసులు ఈ నెల 10న (శనివారం) తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ ప్రభు అంత‌కుముందు వెల్ల‌డించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, నిందితులు మొదట బాలికపై అత్యాచారం చేసి, ఆపై డీజిల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.

ఈ దారుణం సెప్టెంబర్ 7వ తేదీన (బుధ‌వారం) జిల్లాలోని మాధవ్ తండాలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే, బాధితురాలు తనకు ఎదురైన కష్టాలను వివరిస్తున్న వీడియో శనివారం వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాలిన గాయాలతో ఉన్న బాలికను సెప్టెంబర్ 7న ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ ప్రభు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై భారత శిక్షాస్మృతి, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా బాలల రక్షణ (పోక్సో) చట్టం, షెడ్యూల్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల చట్టం కింద శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, అరెస్టు చేసిన నిందితులిద్దరినీ విచారిస్తున్నామని తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (సదర్) యోగేష్ కుమార్ మైనర్ బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా, బాధితురాలు చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయింది.

ఇదిలావుండగా, రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బస్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని వృద్దురాలిపై 32 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నాడనీ, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios