ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA Alliance)కి తాను వేరే పేరు సూచించానని బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) అన్నారు. సీట్ల పంపకాలపై చర్చలు జరగాలని తాను కోరానని, కానీ దానిపై ఇప్పటి వరకు స్పందించలేదని చెప్పారు.
బీహార్ లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరింది. బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమికి తాను వేరే పేరును సూచించానని, కానీ వారు వినలేదని అన్నారు. అలాగే సీట్ల పంపకంపై చర్చలు జరగాలని తాను చాలా సార్లు కోరానని, కానీ దానిపై వారు ఏం మాట్లాడలేదని తెలిపారు.
రాహుల్ గాంధీ కారుపై ఇటుకల దాడి.. అద్దాలు ధ్వంసం.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఘటన
ఈ సందర్భంగా ఇండియా కూటమి నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ మొదటి సారిగా వెల్లడించారు. ప్రతిపక్ష కూటమిపై పనితీరుపై ఆయనపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను చాలా కష్టపడ్డాను. వారు ఒక్క పని కూడా చేయలేదు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఇప్పటి వరకు నిర్ణయించలేదు. అందుకే వాళ్లను వదిలేసి మొదట్లో నేను ఎవరితో ఉన్నానో వాళ్ల దగ్గరికి వచ్చేశాను. బీహార్ ప్రజల కోసం నేను పని చేస్తూనే ఉంటాను’’ అని నితీష్ కుమార్ అన్నారు.
| Patna: On the INDIA alliance, Bihar CM Nitish Kumar says, "I was urging them to choose another name for the alliance. But they had already finalised it. I was trying so hard. They did not do even one thing. Till today they haven't decided which party will contest how… pic.twitter.com/QJtnXVPb0G
— ANI (@ANI)ఆర్జేడీ నాయకుడు, తన మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ను నితీష్ కుమార్ చిన్న పిల్లాడిలా అభివర్ణించారు. బీహార్ కోసం జేడీయూ ఎంత పని చేసిందో తేజస్వీ యాదవ్ కు తెలియదని తెలిపారు. బీహార్ లో చేపట్టిన కుల గణన క్రెడిట్ ను రాహుల్ గాంధీ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారా అని మీడియా ఆయనను ప్రశ్నించింది.
ప్రధాని అభిమానా మజాకా.. 200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల మోడీ భారీ క్యాంస విగ్రహం..
దీనికి నితీష్ కుమార్ సమాధానం ఇస్తూ.. ‘‘కుల గణన ఎప్పుడు జరిగిందో ఆయన మర్చిపోయారా ? 9 పార్టీల సమక్షంలో నిర్వహించాను. 2019-2020లో అసెంబ్లీల నుంచి బహిరంగ సభల వరకు ప్రతిచోటా కుల గణన నిర్వహణపై నేను మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఫేక్ క్రెడిట్ తీసుకుంటున్నాడు’’ అని అన్నారు. ఉపాధ్యాయ నియామక కార్యక్రమం తన విజన్ అని, ప్రతిపక్షాలు దాని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని నితీష్ కుమార్ అన్నారు.
దేవాలయాలు పిక్నిక్, టూరిస్ట్ స్పాట్ కాదు - హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ కోర్టు
ఇదిలావుండగా.. బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో కొలువు దీరిన కొత్త ఎన్డీయే ప్రభుత్వం ఫిబ్రవరి 10న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చేసిన సాధారణ ప్రసంగం తర్వాత బడ్జెట్ సమావేశాల మొదటి రోజున ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.