కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ కారుపై పశ్చిమ బెంగాల్ లో దాడి జరిగింది. ఇటుకలతో ఆయన కారుపై గుర్తు తెలయని దుండుగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.. భారత్ జోడో యాత్ర మాల్డా జిల్లాలోకి ప్రవేశించగానే ఈ దాడి చోటు చేసుకుంది.
పశ్చిమబెంగాల్ లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. బుధవారం ఈ యాత్ర మాల్దా జిల్లాలోకి ప్రవేశించగానే రాహుల్ గాంధీ కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. దీదీంతో ఆయన వాహనం తీవ్రంగా ధ్వంసం అయ్యింది. కారు అద్దాలు కూడా పగిలిపోయాయి.
ప్రధాని అభిమానా మజాకా.. 200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల మోడీ భారీ క్యాంస విగ్రహం..
ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పగిలినప్పటికీ రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే కొంత దూరం వెళ్లిన తరువాత రాహుల్ గాంధీ తన వాహనం దిగారు. పగిలిన అద్దాలను చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
STORY | Rahul Gandhi's car 'pelted with stones' during Congress yatra in Bengal: Adhir Ranjan Chowdhury
READ: https://t.co/1gEDXZJJPY
VIDEO: pic.twitter.com/Mi44AqNeBq
బీహార్ నుంచి పశ్చిమబెంగాల్ లోకి యాత్ర తిరిగి ప్రవేశించడంతో మాల్దాలోని హరిశ్చంద్రపూర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ‘‘రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనం వెనుక అద్దాలు రాళ్లతో కొట్టడంతో పగిలిపోయాయి. ఇది ఆమోదయోగ్యం కాదు’’ అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌధురి పేర్కొన్నారు.
దేవాలయాలు పిక్నిక్, టూరిస్ట్ స్పాట్ కాదు - హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ కోర్టు
రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ప్రారంభమైంది. ఈ యాత్ర 67 రోజుల పాటు సాగనుంది. మొత్తంగా 15 రాష్ట్రాలు, 110 జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. రాహుల్ గాంధీ మొదటి విడత పాదయాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై కాశ్మీర్ లో ముగిసింది.
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. నేడే చివరి తేదీ..
136 రోజుల్లో 4,000 కిలో మీటర్లకు పైగా ఆయన నడిచారు. ఈ రెండో విడత యాత్ర 15 రాష్ట్రాల్లోని 6700 కిలోమీటర్లు సాగుతుంది. అయితే ఈ సారి కాలినడకనే కాకుండా, వాహనాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ యాత్ర మొత్తం 110 జిల్లాల్లోని, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.