జ్ఞానవాపి కేసులో కీలక మలుపు: పూజలు చేసేందుకు హిందువులకు కోర్టు అనుమతి

By narsimha lode  |  First Published Jan 31, 2024, 3:32 PM IST

 జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో  హిందూ దేవతల ప్రతిమలకు  పూజలు చేసేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది.
 


న్యూఢిల్లీ:  జ్ఞానవాపి కేసులో  కీలక మలుపు చోటు చేసుకుంది.  మసీదు ప్రాంగణంలోని  హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేసేందుకు అనుమతిని ఇచ్చారు. ఈ మేరకు వారణాసి కోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. పూజలు చేసుకొనేందుకు  ఏర్పాట్లు చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది.  కోర్టు ఆదేశం కేసులో కీలక మలుపుగా హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు.పూజలు చేసేందుకు  ప్రతి ఒక్కరికి హక్కుందని ఆయన వాదించారు. వారణాసి కోర్టు చారిత్రాత్మక ఆదేశం ఇచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ప్రకటించింది.   ఇది హిందువుల అతి పెద్ద విజయంగా  కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ప్రకటించింది. జ్ఞానవాపి  మసీదులో సీల్ చేసిన నేలమాళిగలో హిందూ సమాజం  పూజలు నిర్వహించే వెసులుబాటు కలిగింది.   మసీదులోని వ్యాస్ కా టెఖానా లో హిందూ భక్తులు  పూజలు చేసేందుకు కోర్టు ఆదేశాలతో అనుమతి లభించిందని  న్యాయవాది తెలిపారు.  ఈ ప్రాంతంలో  1993 నుండి పూజలు ఆగిపోయాయి.

Latest Videos

ఇక్కడ పూజలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏడు రోజుల్లో  ఏర్పాట్లు చేయాల్సి ఉందని  హిందూ పక్షం తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాకు చెప్పారు.వ్యాస్ కా టేఖానాలో  పూజలు చేసేందుకు  హిందువులకు  అనుమతిని లభించిందని మరో న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది తెలిపారు.

జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్ఐ) సర్వే  ఆధారాలను  కోర్టుకు అందింది.ఈ సర్వే రిపోర్టును  ఇరువర్గాలకు అందించాలని కోర్టు ఆదేశించింది.  ఈ రిపోర్టు ఇరు వర్గాలకు అందింది.
 


 

click me!