ఘోరం.. ట్యూషన్ కు వచ్చిన పదేళ్ల బాలికపై 30 ఏళ్ల టీచర్ అత్యాచారం..

By Asianet News  |  First Published Jul 10, 2023, 10:29 AM IST

ఓ ట్యూషన్ టీచర్ 10 ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. తన వద్దకు ట్యూషన్ కు వచ్చిన ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 


నేడు సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు.  ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా ఓ పదేళ్ల బాలికపై ఓ ట్యూషన్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. 

కెమెరాలు వెంట పెట్టుకొని వరి నాట్లు వేసిన మొదటి రైతు రాహుల్ గాంధీ - బీజేపీ

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని 30 ఏళ్ల వ్యక్తి ప్రైవేటుగా ట్యూషన్ క్లాసులు చెబుతున్నారు. అతడి వద్దకు స్థానికంగా నివసించే పదేళ్ల బాలిక 15 రోజుల నుంచి ట్యూషన్ కు వెళ్తోంది. ప్రతీ రోజు ఆ బాలికతో పాటు మరి కొందరు విద్యార్థినులు ట్యూషన్ కు వస్తుంటారు. అయితే శనివారం సాయంత్రం కూడా ఎప్పటిలాగే ఆ బాలిక ట్యూషన్ కు వెళ్లింది.

కానీ ఆ రోజు మిగితా పిల్లలెవరూ ట్యూషన్ కు రాలేదు. అయితే బాలిక ఒంటరిగా ఉందని గమనించిన ఆ టీచర్ కు దుర్భుద్ధి కలిగింది. వెంటనే ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. కొంత సమయం తరువాత బాలిక తన ఇంటికి వచ్చింది. తరువాత తల్లిదండ్రులకు తనపై ట్యూషన్ టీచర్ చేసిన దారుణాన్ని వివరించింది.

జమ్మూకాశ్మీర్ లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రత నమోదు

దీంతో తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూతురుపై జరిగిన లైంగిక దాడిని వివరిస్తూ, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) అమృత గుగులోత్ ఆదివారం వెల్లడించారు. మైనర్ ను కౌన్సిలింగ్, వైద్య పరీక్షలకు పంపినట్లు గుగులోత్ తెలిపారు.

ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్ పై వివాదాస్పద పోస్టు.. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు

నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 (బి) (అవమానించే ఉద్దేశంతో దాడి లేదా క్రిమినల్ బలప్రయోగం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ 8 (లైంగిక దాడికి శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఆ ట్యూషన్ టీచర్ ను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 

click me!