ఇండియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల (Sania Mirza- Shoaib Malik divorce) అంశం మరో సారి తెరపైకి వచ్చింది. సానియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్ (soyab malik photos deleted by sania mirza in instagram) అకౌంట్ లో తన భర్తతో ఉన్న ఫొటోలను డిలీట్ చేయడం, తాజాగా చేసిన పోస్టు విడాకుల రూమర్ కు మరింత ఆజ్యం పోసింది.
sania mirza divorce : గత కొంత కాలంగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే వారు చేస్తున్న చర్యలు పరోక్షంగా విడాకులు వార్తలు వాస్తవమే అనే విధంగా ఉంటున్నాయి.
రైతుగా మారిన కలెక్టర్.. పొలంలో దిగి వరి నాట్లు వేసిన ముజమ్మిల్ ఖాన్..
గతేడాది ఆగస్టులో షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన భార్య, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కు సంబంధించిన వివరాలు తొలగించారు. ఇటీవల సానియా మీర్జా తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా సానియా మీర్జా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఈ విడాకుల వార్తలను మరింత బలపరుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. ఎందుకంటే ?
ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో 'విడాకులు చాలా కష్టం' అని రాసుకురావడం విడాకుల ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. సానియా షేర్ చేసిన ఈ కోట్ ను మొదట healing_out.లౌడ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. ఆ పోస్టులో ‘‘పెళ్లి కష్టమే. విడాకులు కష్టమే.. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి.. ఊబకాయం కష్టం, ఫిట్ గా ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి. అప్పుల ఊబిలో కూరుకుపోవడం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి. కమ్యూనికేషన్ చాలా కష్టం. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి. జీవితం ఎప్పటికీ సులభం కాదు. ఇది ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి’’ అని సానియా మీర్జా షేర్ చేసిన కోట్ లో పేర్కొన్నారు.
recently shared a post on her stories that read, ‘Marriage is hard. is hard. Choose your hard.’ This has yet again reignited divorce speculations with her husband . 😳
Rumors about troubles in their surfaced first in 2022. 🙌🏻 pic.twitter.com/ne3IU1NxoR
కాగా.. జనవరి 8వ తేదీన చేసిన మరో పోస్ట్ లో సానియా మీర్జా ఈ విధంగా క్యాప్షన్ పెట్టారు. ఏదైనా మీ హృదయ శాంతికి భగం కలిగించేది ఏదైనా..దానిని వదిలేయండి అని పేర్కొన్నారు. ఆ పోస్ట్ లో ఆమె ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. అందులో సానియా మీర్జా పెద్ద అద్దం ముందు మౌనంగా, కల్లుమూసుకొని నిలబడింది
రాజాసింగ్ ను విద్వేషపూరిత ప్రసంగాలు చేయనివ్వద్దు - సుప్రీంకోర్టు
ఇదిలా ఉండగా.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోయారనే పుకార్లు ఇప్పుడే మొదలైనవి కావు. 2022 నవంబర్ నుంచి వీరిద్దరి విడాకుల వార్తలు మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచాయి. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు.