మహారాష్ట్రలోని యావత్మాల్ లో, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో హిందూ జనజాగృతి సమితి, టీ. రాజాసింగ్ తలపెట్టిన బహిరంగ సభల అనుమతులు రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. అయితే అలా ఆదేశాలు జారీ చేయలేమని కోర్టు తెలిపింది. కానీ ఈ సభల్లో విద్వేషపూరిత ప్రసంగాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ ను విద్వేష పూరిత ప్రసంగాలు చేయనివ్వకూడదని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో హిందూ జనజాగృతి సమితి, ఛత్తీస్ గఢ్ లో రాజాసింగ్ చేపట్టనున్న బహిరంగ సభలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు చర్యలు తీసుకోవడానికి నిరాకరించింది.
ఈ చైనా ఊరికే ఉండదుగా.. మరో ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు.. 100 శాతం మరణాల రేటట..
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. 'హిందూ రాజ్య స్థాపన' సాకుతో ఈ నాయకులు చేసే ప్రసంగాలన్నీ తప్పనిసరిగా ముస్లింలపై హింసకు, బహిష్కరణకు పిలుపునిస్తాయని ఆరోపిస్తూ ఈ ర్యాలీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే దీనిపై ముందస్తు చర్యలు తీసుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. పిటిషనర్ చేసిన ఆరోపణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని యవత్మాల్, మహారాష్ట్ర, రాయ్ పూర్ జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించింది.
అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు అవసరమైతే పోలీసులు రికార్డింగ్ సౌకర్యాలతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, హింసను ప్రేరేపించడం లేదా విద్వేషపూరిత ప్రసంగాలను అనుమతించబోమని కోర్టు పేర్కొంది.
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. ఎందుకంటే ?
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. రాబోయే ర్యాలీల్లో ప్రసంగించనున్న వ్యక్తులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. అయినప్పటికీ.. ముందస్తు చర్యలు తీసుకోలేమని, విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు మాత్రమే అలా చేయొచ్చని కోర్టు తెలిపింది. ‘‘ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఏదైనా జరిగితే, వారు చర్య తీసుకోవచ్చు’’ అని కోర్టు తెలిపింది.
ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నాయని కపిల్ సిబల్ వ్యాఖ్యానించగా.. గతంలో ఇచ్చిన ఆదేశాల తర్వాత మార్పు వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది. కొంత సానుకూలత ఉందని, నెగెటివ్ మాత్రమే ఎందుకు చూడాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. కాగా.. జనవరి 18వ తేదీన మహారాష్ట్రలోని యావత్మాల్ లో హిందూ జనజాగృతి సమితి, అలాగే 19 నుంచి 25వ తేదీ వరకు ఛత్తీస్ గఢ్ లో టి.రాజాసింగ్ తలపెట్టిన బహిరంగ సభల నిర్వహణకు ఆయా రాష్ట్రాల డీజీపీ, అధికారులను ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.