Niti Ayog Report : ఆ రంగంలో.. తెలంగాణ‌ 3వ స్థానం.. ఏపీ 4వ స్థానం

By Rajesh KFirst Published Dec 27, 2021, 4:50 PM IST
Highlights

తెలంగాణ మ‌రో ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ఆరోగ్య రంగం ప‌నితీరుపై NITI ఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) విడుద‌ల చేసిన ఆరోగ్యసూచిలో తెలంగాణ‌ మూడవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అత్యంత మెరుగుద‌ల‌తో కేర‌ళ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది.

NITI ayog report 2019-20: తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఆరోగ్య రంగం పనితీరుపై NITI ఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) విడుద‌ల చేసిన ఆరోగ్యసూచిలో తెలంగాణ‌ మూడవ స్థానంలో నిలిచింది. గ‌తేడాది మూడోస్థానంలో ఉన్న ఏపీ.. ఒక స్థానానికి దిగజారి నాలుగో స్థానంలో నిలిచింది.

2019-20 ఏడాదిలో  వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించి రాష్ట్రాల ర్యాంకులను నీతి ఆయోగ్ సోమవారం వెల్లడించింది. మొత్తం 23 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరు అంచనావేసి ర్యాంకులను ప్రకటించింది. ఆరోగ్య సూచీలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరుతో కేరళ మ‌రోసారి తొలిస్థానంలో నిలిచింది. ఆ త‌రువాత స్థానంలో త‌మిళనాడు నిలిచింది.

Read Also : ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే.. Chandigarh మున్సిపోల్స్ లో ఆప్ హావా..

ఆర్థిక సంస్కరణలు త‌రువాత .. దేశం అనేక విషయాల్లో పురోగ‌తి సాధించింది. త‌ద్వారా  రాష్ట్రాల్లో ఆరోగ్య సూచీలు బాగానే మెరుగుపడ్డాయి. అయితే.. పెద్ద రాష్ట్రాల్లో మెరుగైన స‌దుపాయాలు, చిన్న రాష్ట్రాల్లో స‌దుపాయాల కొర‌త ఇలా.. చాలా విష‌యాల్లో  వ్యత్యాసాలు క‌నిపించాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి రాష్ట్రాల మధ్య నీతి ఆయోగ్‌ పోటీ నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా సోమ‌వారం ర్యాంకులను విడుదల చేసింది. మొత్తం 23 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసింది.

తాజాగా విడుద‌ల చేసిన‌.. 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానం, ఏపీ నాలుగు స్థానంతో  రెండు తెలుగు రాష్ట్రాలు మెరుగైన స్థానాల్లో నిలిచాయి. 2018-19 సంవత్సరాలల్లో నీతి అయోగ్ జాబితాలో తెలంగాణ 4వ స్థానంలో నిల‌వ‌గా, 2019-20 జాబితాలో ఒక స్థానం ఎగ‌బాకి.. ఈ ఏడాది మూడో స్థానానికి చేరింది.  అంతే కాకుండా.. ఓవరాల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఇంక్రిమెంటల్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా తెలంగాణ మెరుగైన పనితీరు కనబరిచింది. ఈ  రెండు విభాగాల్లోనూ మూడో స్థానంలో నిలిచిందని అని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.

Read Also : Five States Election in 2022: ఒమిక్రాన్​ ఎఫెక్ట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా? ఈసీ నిర్ణ‌యంపై ఉత్కంఠ

మిజోరం (చిన్న రాష్ట్రాలలో) మరియు తెలంగాణ (పెద్ద రాష్ట్రాలలో) మాత్రమే రెండు రాష్ట్రాలు మెరుగైన  పనితీరును ప్రదర్శించాయి. బేస్ ఇయర్ (2018-19),  రెఫరెన్స్ ఇయర్ (2019-20) మధ్య ఇంక్రిమెంటల్ పనితీరులో చాలా మెరుగుదల ఉంద‌ని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఓవరాల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఇంక్రిమెంటల్ పెర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అనేక సూచికల విషయానికొస్తే, సాధ్యమైనంత వ‌ర‌కు ఉత్తమమైన పనితీరును సాధించిన రాష్ట్రం  తెలంగాణ అని తెలిపింది. 
 
అలాగే పెద్ద రాష్ట్రాలు మాత్రం ఆరోగ్య రంగం పనితీరులు వెనుకబడినట్టుగా నీతి అయోగ్ వెల్లడించింది. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆఖరి స్థానంలో నిలవటం అత్యంత గమనించాల్సిన విషయం. చిన్న రాష్ట్రాల జాబితాలో మిజోరం చక్కటి స్థానాన్ని పొందింది. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో ఢిల్లీ, జ‌మ్మూక‌శ్మీర్ ముందున్నాయి.

Read Also : Assembly Election 2022: ఉత్త‌రాఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ లో కలవరం.. పార్టీలో మార్పులు చేయాలంటున్న మాజీ సీఎం!

టాప్ 5 లో నిలిచిన రాష్ట్రాలు:

1. కేరళ -  హెల్త్ ఇండెక్స్ స్కోరు 82.20

2. తమిళనాడు - హెల్త్ ఇండెక్స్ స్కోరు 72.42

3. తెలంగాణ - హెల్త్ ఇండెక్స్ స్కోరు 69.96

4. ఆంధ్రప్రదేశ్ - హెల్త్ ఇండెక్స్ స్కోరు 69.95

5. మహారాష్ట్ర హెల్త్ ఇండెక్స్ స్కోరు  69.14

click me!