చికిత్స సమయంలో రోగి మరణిస్తే డాక్టర్‌ నిర్లక్ష్యంగా పరిగణించలేం.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు

By team teluguFirst Published Dec 1, 2021, 10:26 AM IST
Highlights

రోగికి వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొంది. చికిత్స సమయంలో రోగి మరణిస్తే డాక్టర్‌ని దోషిగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
 

వైద్య వృత్తి, పేషెంట్లకు డాక్టర్లు అందిస్తున్న చికిత్సకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రోగికి వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఏ డాక్టరైనా తన వద్ద చికిత్స పొందుతున్న రోగి జీవితానికి భరోసా ఇవ్వలేదని.. కానీ ప్రతి ఒక్కరికి తన సామర్థ్యానికి తగినట్టుగా చికిత్స చేయడానికి మాత్రం ప్రయత్నించగలరని జస్టిస్ హేమంత్ గుప్తా, వి రామ సుబ్రమణియన్‌లో కూడా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. చికిత్స సమయంలో రోగి మరణిస్తే దానిని వైద్యుల సహజ నిర్లక్ష్యంగా పరిగణించలేమని పేర్కొంది.

1998 జూన్‌లో చికిత్స విఫలమై మరణించిన దినేష్ జైస్వాల్ మరణించాడు. అయితే శస్త్రచికిత్సలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వైద్యం అందిస్తున్న సీనియర్‌ డాక్టర్ లేకపోవడం, ఆపరేషన్‌ థియేటర్‌ లేకపోవడం, యాంజియోగ్రఫీ యంత్రం పాడైపోవడంతో జైస్వాల్‌ మృతి చెందాడని అతని కుటుంబీకులు రోపిస్తున్నారు. ఆసుపత్రి మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. వైద్య నిపుణులచే సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స, అందుబాటులో ఉన్న వనరులలో ద్వారా అందిచినట్టుగా తెలిపింది. అయితే ఈ క్రమంలోనే దినేష్ జైస్వాల్ కుటుంబానికి రూ. 14.18 లక్షల పరిహారాన్ని వడ్డీతో కలిపి చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులపై బాంబే హాస్పిటల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయింది. అయితే తాజగా సుప్రీం ధర్మాసనం ఆ ఉత్వర్వులను కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.  

‘రోగి చనిపోయినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్యుడిని నిందించే ధోరణి ఉంది. ఇలాంటి సందర్భాల్లో మరణాన్ని అంగీకరించకుండా రోగి కుటుంబ సభ్యులు చేసే ప్రవర్తన అంగీకరించకూడనిది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా, వారి సౌకర్యాలు చూసుకోకుండా పనిచేసిన వైద్య నిపుణులపై కొందరు రోగులు కుటుంబ సభ్యులు భౌతిక దాడుకుల దిగడం కరోనా సమయంలో ఎక్కువగా చోటుచేసుకున్నాయి’ అని ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది.

’చికిత్స అందించినప్పటికీ రోగి బతకక పోతే.. వైద్యులను నిందించలేం. వైద్యులు అత్యుత్తమ సామర్థ్యాలతో చికిత్స అందిస్తారు.. అయితే అనివార్యమైన వాటిని నిరోధించలేరు’ అని ధర్మాసనం పేర్కొంది. చికిత్స సఫలం కాకపోవడం,  శస్త్రచికిత్స సమయంలో రోగి మరణించడం వంటి ప్రతి సందర్భంలోనూ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు భావించలేమని ధర్మాసనం పేర్కొంది. దానిని నిరూపించడానికి తగిన వైద్య ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది. వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆరోపణలు కేవలం ఊహాగానాల ఆధారంగా ఉండకూడదు. ప్రస్తుత కేసులో, ఆరోపణలకు సంబంధించి  కమిషన్ ముందు దాఖలు చేసిన ఫిర్యాదు కేవలం అఫిడవిట్ మాత్రమే అని సుప్రీంకోర్టు గమనించింది. వైద్యుల నిర్లక్ష్యానికి మరే ఇతర వైద్య ఆధారాలు లేవని అభిప్రాయపడింది.

click me!