శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

By sivanagaprasad kodatiFirst Published Oct 9, 2018, 11:32 AM IST
Highlights

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై ‘‘ స్టే ’’ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. రెండు సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై ‘‘ స్టే ’’ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. రెండు సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాల్సిందిగా నేషణల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్, నాయర్ సర్వీస్ సొసైటీలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.

దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇప్పటికిప్పుడు అత్యవసర విచారణ జరపలేమని సీజేఐ తెలిపారు. తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.

కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ గత నెల 28న నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఈ తీర్పుపై మేధావులు, ఉన్నత విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటికే కేరళలోని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

click me!