ఒక్క రోజు బ్రిటీష్ హైకమిషనర్ గా భారతీయ విద్యార్థిని

By ramya neerukondaFirst Published Oct 9, 2018, 10:50 AM IST
Highlights

అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవం. కాగా ఆ రోజును పురస్కరించుకొని  బ్రిటీష్ హై కమిషన్ 18నుంచి 23ఏళ్ల మధ్య వయసుగల అమ్మాయిలకు ఓ కాంపిటీషన్ నిర్వహించారు. 

యాక్షన్ హీరో అర్జున్ ఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఈ సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిని  బ్రిటీష్ హై కమిషనర్ గా 24గంటల పాటు విధులు నిర్వర్తించింది. ఆమే ఈషా బెహల్.

ప్రస్తుతం ఈషా.. నోయిడా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలో విద్యనభ్యసిస్తోంది. కాగా.. అనుకోకుండా ఆమె ఒక్కరోజు బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకుంది.

అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవం. కాగా ఆ రోజును పురస్కరించుకొని  బ్రిటీష్ హై కమిషన్ 18నుంచి 23ఏళ్ల మధ్య వయసుగల అమ్మాయిలకు ఓ కాంపిటీషన్ నిర్వహించారు. అందులో గెలిచినవారికి ఒక్కరోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.

మీ దృష్టిలో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏమిటి.. అనే ప్రశ్నకు సమాధానంగా ఓ చిన్న వీడియోని రూపొందించి పంపించాల్సిందిగా వారు అమ్మాయిలను కోరారు. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 58మంది అమ్మాయిలు వీడియోలను పంపించారు.

కాగా.. అలా పంపిన వీడియోల్లో ఈషా విజయం సాధించింది. దీంతో ఆమెకు ఒక్క రోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశం లభించింది.  దీనిపై ఈషా మాట్లాడుతూ.. ‘‘బ్రిటీష్ హైకమిషనర్ గా ఒక్కరోజు పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇది ఒక యూనిక్ ఎక్స్ పీరియన్స్. దీని వల్ల యూకేకీ భారత్ కి మధ్యగల సంబంధాల గురించి కొంత తెలుసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది’’ అని ఈషా వివరించింది. 
 

click me!