యువతిపై గ్యాంగ్ రేప్ ,హత్య కేసులో మరణ శిక్ష: ముగ్గురు దోషులను నిర్ధోషులుగా పేర్కొన్న సుప్రీంకోర్టు

By narsimha lodeFirst Published Nov 7, 2022, 3:51 PM IST
Highlights

ఓ  యువతిపై అత్యాచారం చేసి  హత్య చేసిన ఘటనకు సంబంధించి ఢిల్లీ కోర్టు ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించింది.అయితే ఈ ముగ్గురు  నిందితులను  సుప్రీంకోర్టు  నిర్ధోషులుగా ఇవాళ తీర్పును  వెల్లడించింది.
 

న్యూఢిల్లీ: 2012లో న్యూఢిల్లీలో ఓ యువతిపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనలో ముగ్గురిని దోషులుగా తేల్చిన న్యూఢిల్లీ కోర్టు మరణశిక్షణ విధించింది.అయితే ఈ  ముగ్గురిని  సుప్రీంకోర్టు   నిర్ధోషులుగా  ప్రకటించింది.

2012లో 19ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య  చేశారనే కేసులో ముగ్గురికి ఢిల్లీ కోర్టు మరణవిక్షణ విధించింది.ఓ వ్యవసాయ పొలంలో మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.మృతదేహంపై చాలా చోట్ల గాయాలున్న విషయాన్ని కూడ పోలీసులు అప్పట్లో గుర్తించారు.2014లో  ఈ కేసులో ఈ   ముగ్గురిని దోషులుగా ఢిల్లీ కోర్టు నిర్ధారించింది.అంతేకాదు   వారికి మరణ  శిక్షణను కూడా విధించింది.

2012 ఫిబ్రవరిలో రవికుమార్,వినోద్,రాహుల్ అనే ముగ్గురు 19ఏళ్ల  యువతిని  కిడ్నాప్ చేసి  హత్య చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ  ఘటనపై ఢిల్లీలోని ఛవాలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

తన సహచర ఉద్యోగులతో  కలిసి మృతురాలు ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ  ముగ్గురు నిందితులు కిడ్నాప్ చేశారు.. హర్యానాలోని రెవారీ జిల్లా  ఆవాల గ్రామంలోని  పొలంలో  విడతలవారీగా అత్యాచారానికి  పాల్పడి హత్య చేశారు. నిర్భయ ఘటనకు కొన్ని  నెలల   ముందు  ఈ ఘటన చోటు చేసుకుంది.

click me!