భారతదేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించిన ప్రత్యేక విషయాలు

By Mahesh RajamoniFirst Published Oct 2, 2022, 1:30 PM IST
Highlights

Bahadur Shastri Jayanti 2022: భారతదేశ ఆహార ఉత్పత్తికి డిమాండ్‌ను పెంచడానికి హరిత విప్లవం ఆలోచనను ఏకీకృతం చేసిన నాయ‌కుడు.. జై జవాన్, జై కిసాన్ అంటూ రైతులు, సైనికులు ఈ దేశానికి చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి.
 

Bahadur Shastri Jayanti 2022: జై జవాన్, జై కిసాన్ అంటూ రైతులు, సైనికులు ఈ దేశానికి చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి. భార‌త‌దేశ మొద‌టి ప్ర‌ధానమంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ త‌ర్వాత ప్ర‌ధాని పద‌వి చేప‌ట్టిన ఆయ‌న అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిజాయితీ క‌లిగిన భార‌త రెండో ప్ర‌ధానిగా పేరుగాంచారు. ఆయ‌న సేవ‌ల‌కు గానూ భార‌త ప్ర‌భుత్వ అత్యున్న‌త పుర‌స్కారం ల‌భించింది. మరణానంతరం భార‌తర‌త్న అందుకున్న మొద‌టివ్య‌క్తిగా నిలిచారు. నేడు యావ‌త్ భార‌తావ‌ని ఆయ‌న సేవ‌ల‌ను గుర్తుచేసుకుంటూ.. జ‌యంతిని జ‌రుపుకుంటోంది. 

భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌సరాయ్‌లో 1904లో ఈ రోజున జన్మించారు. నిరాడంబరమైన నేపథ్యం నుండి  వ‌చ్చిన ఆయ‌న జాతిపిత గాంధీ పట్ల చాలా గౌరవం కలిగి ఉండేవారు. రాజకీయాల్లో  ఎన్నో కీలక పదవులు చేపట్టాడు. ఆయ‌న జీవితంలోని కొన్ని సంఘ‌ట‌న‌లు ఇలా వున్నాయి.. 
 
జీవితం తొలి దశలో

తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, లాల్‌కు విద్యా పీఠ్ బ్యాచిలర్ డిగ్రీలో భాగంగా "శాస్త్రి" బిరుదును ప్రదానం చేసింది. ఈ బిరుదు ఆయ‌న పేరున నిలిచిపోయింది. దీంతో ఆయ‌న‌ను అంద‌రూ లాల్ బహదూర్ శాస్త్రి అని పిల‌వ‌డం మొద‌లైంది. 1920ల చివరలో, శాస్త్రిజీ భారత స్వాతంత్య్ర‌ ఉద్యమంలో చురుకైన సభ్యుడిగా మారారు. త‌న‌ పూర్తి శక్తితో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. తరువాత 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఆయనను బ్రిటీష్ ప్రభుత్వం రెండు సంవత్సరాలకు పైగా జైలుకు పంపింది. గాంధీ క్విట్ ఇండియా ప్రసంగం తర్వాత 1942లో మళ్లీ జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. మొత్తంగా సుమారు 9 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. శాస్త్రిజీ పుస్తకాలు చదవడం, పాశ్చాత్య విప్లవకారులు, సంఘ సంస్కర్తలు, తత్వవేత్తల రచనలతో తనను స్ఫూర్తిని పొందేవారు. 

రాజకీయ ప్రాముఖ్యత

భారతదేశం స్వాతంత్య్ర‌ పొందిన తరువాత లాల్ బదూర్ శాస్త్రి అసాధారణ విలువను కాంగ్రెస్ అధికారం చేపట్టే సమయానికి అప్పటి జాతీయ ఉద్యమ నాయ‌కులు గుర్తించారు. ఆయన తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. అన‌తికాలంలోనే హోం మంత్రి స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత 1951లో న్యూఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రివర్గంలో రైల్వే మంత్రి, రవాణా, కమ్యూనికేషన్ల మంత్రి, వాణిజ్యం-పరిశ్రమల మంత్రి, హోం మంత్రితో సహా అనేక పదవులను నిర్వహించారు. అయితే, ఒక విషాద రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ శాస్త్రి తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటు ముందు జరిగిన సంఘటనపై చర్చిస్తున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి నైతిక సమగ్రతను, ఉన్నతమైన సూత్రాలను కొనియాడారు.

లాల్ బహదూర్ శాస్త్రి జూన్ 9, 1964న భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాల ఉత్పత్తిని పెంపొందించే సమాఖ్య చొరవ అయిన శ్వేత విప్లవం కోసం చ‌ర్య‌లు తీసుకున్నారు. భారతదేశంలో ఆహార ఉత్పత్తిని పెంచడానికి, అతను హరిత విప్లవానికి మద్దతు ఇచ్చారు. జై జవాన్, జై కిసాన్ అంటూ రైతులు, సైనికులు ఈ దేశానికి చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి 11 జనవరి 1966న గుండెపోటుతో మరణించారు.

click me!