మంత్రి రాసలీలల కేసు: సిట్ అదుపులో నిందితుడి భార్య.. అతని ఇంట్లో కీలక ఆధారాలు

By Siva KodatiFirst Published Mar 25, 2021, 5:08 PM IST
Highlights

కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న నరేశ్‌ భార్యను సిట్‌ బృందం బుధవారం అదుపులోకి తీసుకుంది.

కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న నరేశ్‌ భార్యను సిట్‌ బృందం బుధవారం అదుపులోకి తీసుకుంది.

శిరా పోలీస్‌ స్టేషన్‌ సీఐ అంజుమాల నేతృత్వంలో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీడీ కేసులో విలేకరి నరేశ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అతడు, ఇటీవల ఓ వీడియో విడుదల చేసి, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.

Latest Videos

అదే విధంగా, సీడీలో ఉన్న యువతి తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరిందని ఆయన తెలిపారు. అంతకు మించి ఈ వ్యవహారంలో తనకేమీ తెలియదని నరేశ్ వెల్లడించాడు.

Also Read:రాసలీలల కేసు : చేతులు మారిన కోట్లాది రూపాయలు !!

అతని వాదన ఇలా వుంటే.. సిట్‌ సోదాల్లో భాగంగా నరేశ్‌ ఇంట్లో లక్షలాది రూపాయలు విలువ చేసే బంగారు నగలు కొన్నట్లు రసీదులు దొరకడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. దీంతో సిట్ బృందం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది.

కాగా మార్చి 2న విడుదలైన రాసలీలల సీడీలో కనిపించిన యువతి కోసం సిట్‌ పోలీసులు ఎంతగా గాలిస్తున్నా ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో సీడీ కేసు విషయమై అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండటంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఇరకాటంలో పడింది. 

click me!