Asianet News TeluguAsianet News Telugu

రాసలీలల కేసు : చేతులు మారిన కోట్లాది రూపాయలు !!

కర్ణాటక మాజీ మంత్రి సీడీ కేసులో అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై సిట్ ప్రత్యేక బృందం కూపీ లాగుతోంది. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అనుమానాలున్నాయి. 

ramesh jarkiholi CD scnadal case SIT probe on suspects bank accounts - bsb
Author
Hyderabad, First Published Mar 18, 2021, 3:54 PM IST

కర్ణాటక మాజీ మంత్రి సీడీ కేసులో అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై సిట్ ప్రత్యేక బృందం కూపీ లాగుతోంది. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అనుమానాలున్నాయి. 

ఇప్పటికే ఐదారుమందిని పిలిపించి విచారించి సిట్ సమాచారం సేకరించింది. ఓ అనుమానిత వ్యక్తి రూ. 26 లక్షల నగదు తీసుకున్నట్లు తేలింది. మరోవ్యక్తి విలువైన కారు కొనుగోలుకు చేసేందుకు ప్రయత్నించారని తెలిసింది. ఇప్పటికే 8మంది అనుమానితుల జాబితాను సిద్ధం చేసింది. కొందరి ఇళ్లపై దాడి చేసి కంప్యూటర్లు, డాక్యుమెంట్లను సీజ్ చేసింది. 

అయితే సిట్ ఎంత ప్రయత్నించినా సూత్రదారులు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సిమ్ కార్డులు, ప్రాంతాలు మారుస్తూ తిరుగుతున్న మాజీ మంత్రి వీడియో సీడీ  సూత్రదారులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 

మాజీమంత్రి రమేష్ జార్కి హోళి పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత 4 సిట్ బృందాలు గాలిస్తున్నాయి. సీడీలో ఉన్న యువతితో ఇద్దరు సూత్రదారులు కలిసి ఉన్నారని అనుమానిస్తున్నారు. గోవా, తిరుపతి, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వెతికినా ఫలితం లేదు. 

ఊరు మారినప్పుడల్లా కొత్త సిమ్ లు కొని, వాడిన తరువాత పడేస్తున్నారు. ఫోన్‌ చేశాక స్విచ్చాఫ్‌ చేస్తున్నారు. దీంతో వీరిని కనిపెట్టడం కష్టమవుతోందని అంటున్నారు.  ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా చెబుతున్న యువతికి కేసు సూత్రదారులతో మంచి పరిచయాలు ఉన్నాయని సిట్‌ పోలీసులు భావిస్తున్నారు. 

నిందితుల్లో ఒకరు ఆమె క్లాస్ మేట్ అని తెలిసింది. బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో నెలకు రూ. 30వేల జీతంతో ఉద్యోగం చేసేది యువతి. కన్నడ సంఘాల్లో చురుగ్గా పనిచేసేదన్నారు. మీడియా వారితోనూ సంబంధాలు కలిగి ఉండేదని పోలీసులు చెబుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios