గోరఖ్ పూర్ అప్పుడలా, ఇప్పుడిలా... సీఎం యోగి ఆసక్తికర కామెంట్స్

By Arun Kumar P  |  First Published Sep 19, 2024, 9:12 PM IST

సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. 


పదిహేను - ఇరవై సంవత్సరాల క్రితం వరకు భయానికి, అనేక కష్టాలకు, సమస్యలకు కేంద్రంగా గోరఖ్‌పూర్ వుడేందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వేగంగా అభివృద్ధి జరుగుతోంది... ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయన్నారు. ఇప్పుడు గోరఖ్ పూర్ అంటే ఆధునిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తోందని పేర్కొన్నారు.

గురువారం రామ్‌గఢ్ తాల్ జెట్టీ వద్ద 'ఫ్లోట్' పేరిట ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను సీఎం యోగి ప్రారంభించారు. అలాగే గోరఖ్‌పూర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (జిడిఎ) నిర్మిస్తున్న గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులో ఏడుగురు లబ్ధిదారులకు నివాసాలను కేటాయిస్తూ ధ్రువపత్రాలను అందజేశారు. 

Latest Videos

undefined

ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ... గోరఖ్‌పూర్ ఒకప్పుడు భయానికి,  ఎక్కడికక్కడ నిలిచిపోయిన అభివృద్ధికి పర్యాయపదంగా ఉండేదని అన్నారు. "ఏడు సంవత్సరాల క్రితం, నగరం అభివృద్ధికి దూరంగా ఉండేది. నేటి కార్యక్రమం జరిగిన రామ్‌గఢ్ తాల్ చుట్టుపక్కల ప్రాంతం అశుభ్రత, నేరాలకు కేంద్రంగా ఉండేది.  నగరం తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొనేది" అని యోగి గుర్తుచేసుకున్నారు.

అయితే గత ఏడు సంవత్సరాలలో ఊహించన విధంగా గోరఖ్ పూర్ మారిపోయిందన్నారు.  "గోరఖ్‌పూర్ ఇప్పుడు నాలుగు, ఆరు లేన్ల రోడ్లు, రద్దీగా ఉండే విమానాశ్రయం, మెరుగైన రైల్వే కనెక్టివిటీ, పున:ప్రారంభించిన ఎరువుల కర్మాగారం, ప్రీమియర్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌గా మారిన బిఆర్‌డి మెడికల్ కాలేజీని కలిగి ఉంది. ఎయిమ్స్ కూడా ఇప్పుడు చక్కగా పనిచేస్తోంది" అని అన్నారు. 

ఒకప్పుడు దాదాపుగా శిథిలావస్థకు చేరుకున్న రామ్‌గఢ్ తాల్ ఇప్పుడు ఆకర్షనీయ ప్రదేశంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. 1800 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ సహజ సరస్సు ఇప్పుడు మరింత అందంగా మారి పర్యాటకులను ఆకర్షిస్తోందని అన్నారు. కొత్తగా హోటళ్లు ప్రారంభమవుతున్నాయి... క్రూయిజ్ సర్వీస్ ఇప్పటికే ఏర్పటయ్యాయని తెలిపారు.  ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభంతో సరస్సు ఒడ్డున అల్పాహారం, భోజనం చేస్తూ ఆ అందాలను ఆస్వాదించే ప్రత్యేక అవకాశాన్ని లభించిందన్నారు.  ఇలా ప్రభుత్వ చర్యలు ఈ ప్రాంతాన్ని ఆకర్షనీయంగా మార్చడమే కాదు కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.  

గోరఖ్‌పూర్‌ను సందర్శించేవారు ఇప్పుడు ఫైవ్ స్టార్ సౌకర్యాలను ఆస్వాదించవచ్చని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రామ్‌గఢ్ తాల్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం గురించి ఆయన ప్రస్తావించారు. అద్భుతమైన లైటింగ్ ద్వారా మెరుగుపర్చబడిన నగరం రాత్రిపూట మరింత ఆకర్షనీయంగా కనిపిస్తోందని అన్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ స్థానికులు,  అంతర్జాతీయ పర్యాటకులకు అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గోరఖ్‌పూర్ మెరుగైన కనెక్టివిటీ కారణంగా కొత్త హోటళ్ల గొలుసు, కన్వెన్షన్ సెంటర్‌తో సహా రాబోయే పరిణామాలను కూడా ఆయన ప్రస్తావించారు. 

 

click me!