కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్..? అర్ధరాత్రి వరకు సాగిన సీఎల్పీ సమావేశం..

By Asianet NewsFirst Published May 15, 2023, 7:50 AM IST
Highlights

కర్ణాటక కొత్త సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఉంటారని తెలుస్తోంది. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మల్లికార్జున్ ఖర్గే నేడు అధికార ప్రకటన విడుదల చేస్తారు. 

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక అధికారిక ప్రకటన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు (సోమవారం) వెలువరించే అవకాశం ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక ఏఐసీసీ ఇన్ ఛార్జి రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా ఆదివారం రాత్రి  క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక సీఎంగా ఎవరు ఉండాలనే విషయం ప్రకటించేందుకు ఖర్గేకు ఎక్కువ సమయం పట్టదని, త్వరలోనే దానిని ప్రకటిస్తారని చెప్పారు. 

కర్ణాటకలోని బెంగళూరులో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సుర్జేవాలా అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. నా తీర్పును ఖర్గే సాహెబ్ తీర్పుతో భర్తీ చేయలేను. ఆయన మా సీనియర్. మీ అందరికీ తెలుసు ఆయన కర్ణాటక మట్టి పుత్రుడని.. ఆయనకు ఎక్కువ సమయం పట్టదని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు. 

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్, వ్యాన్ ఢీ.. 13 మంది మృతి.. ఎక్కడంటే ?

కర్ణాటక ముఖ్యమంత్రి పేరును ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకుడిని నియమించే అధికారం ఏఐసీసీ అధ్యక్షుడికి ఉందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

1.30 గంటల వరకు సాగిన సీఎల్పీ సమావేశం..
బెంగళూరులోని ఓ హోటల్లో ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ సమావేశం అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగింది. కొత్తగా ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్టీ నేతలు జితేంద్ర సింగ్, దీపక్ బబారియా పరిశీలకులుగా ఈ సమావేశానికి హాజరయ్యారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ తదితరులు సైతం ఈ సమావేశంలో ఉన్నారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను వ్యక్తిగతంగా కలిసే ప్రక్రియ మొత్తం పూర్తయింది. పరిశీలకులు ఎమ్మెల్యేలందరినీ విడివిడిగా కలుసుకుని వారి అభిప్రాయాలను నమోదు చేశారు. ఆ అభిప్రాయాలను నివేదిక రూపంలో హైకమాండ్ కు సమర్పించాలని నిర్ణయించారు. దాని ఆధారంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను ప్రకటిస్తామని కర్ణాటక ఏఐసీసీ ఇంచార్జ్ రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా మీడియాతో తెలిపారు. 

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యే ఎందుకు ? 
కర్ణాటకలో విజయం తర్వాత 2024 లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సిద్ధరామయ్యకు ఉన్న మాస్ అప్పీల్ ను క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే 2024 లోక్ సభ ఎన్నికలకు సిద్ధరామయ్యను ప్రధాన 'ముఖం'గా, శివకుమార్ ను మేనేజర్ గా ప్రొజెక్ట్ చేయాలని పార్టీ భావిస్తోంది.

కనికరించని అంబులెన్స్ సిబ్బంది.. ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని .. 200 కిలోమీటర్లు ప్రయాణం.

అహిందా ఫార్ములా కోసమేనా ? 
కర్ణాటక పాపులర్ - అహిందా ఫార్ములా తమ విజయంలో పెద్ద పాత్ర పోషించిందని కాంగ్రెస్ భావిస్తోంది. అహిందా లో ‘అ’ అంటే అల్పసంఖ్యతరు (మైనారిటీలు) ‘హిం’ అంటే హిందూలిదావరు (వెనుకబడిన తరగతులు) దా అంటే దళితులు  అని అర్థం. ఈ వర్గాలను అహిందా అనే సంక్షిప్త పదంతో పేర్కొంటారు. అయితే ఈ వర్గాల ఓటు బ్యాంకును మేనేజ్ చేయడంలో సిద్ధరామయ్య నిపుణుడని, ఈ సామాజిక వర్గాల్లో ప్రజాదరణ ఉందని హైకమాండ్ భావిస్తోంది. దీంతో గతంలో జేడీఎస్ నాయకత్వంపైనే తిరుగబాటు చేసిన చరిత్ర ఉన్న సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా వెళ్లాలని ఆ పార్టీ కోరుకోవడం లేదు.

click me!