బీజేపీకి షాక్.. రాజకీయాల నుంచి తప్పుకున్న కర్ణాటక మంత్రి.. పార్టీకి ప్రచారం కూడా చేయబోనని ప్రకటన.. ఎందుకంటే ?

Published : Apr 13, 2023, 11:45 AM IST
బీజేపీకి షాక్.. రాజకీయాల నుంచి తప్పుకున్న కర్ణాటక మంత్రి.. పార్టీకి ప్రచారం కూడా చేయబోనని ప్రకటన.. ఎందుకంటే ?

సారాంశం

కర్ణాటకలో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులు పార్టీని వీడుతున్న సమయంలో మరో సీనియర్ నాయకుడు, ప్రస్తుత మంత్రి కూడా బీజేపీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. తాను పార్టీ తరుఫున ప్రచారం కూడా చేయబోనని స్పష్టం చేశారు. 

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు ఇతర పార్టీలకు చేరుతున్నారు. తాజాగా ప్రస్తుతంగా మంత్రిగా ఉండి, ఆరు సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అంగర ఎస్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాని ప్రకటించారు. అలాగే కాషాయ పార్టీ తరఫున ప్రచారం చేయబోనని కూడా తేల్చి చెప్పారు. 

దోహా ఎయిర్ పోర్టులో భారత కరెన్సీని ఉపయోగించిన సింగర్ మికా సింగ్.. ప్రధాని మోడీకి సెల్యూట్ అంటూ ట్వీట్..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ ఏప్రిల్ 11వ తేదీన, రెండో జాబితాను 12వ తేదీన ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి జాబితాలో 189 మంది పేర్లు, రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ఉన్నాయి. అయితే ఈ రెండు జాబితాల్లో అంగర పేరు లేదు. ఈ విషయంలోనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సులియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అంగర ఎస్ కు ఈసారి ఆ స్థానం టికెట్ కేటాయించలేదు. దీనినిషెడ్యూల్డ్ కులాల అభ్యర్థి అయిన భాగీరథి మురళికి కేటాయించారు. ఈ పరిణామంపై మంత్రి ఆయన స్పందించారు. ఇది తన నిజాయితీ ఎదురుదెబ్బ అని చెప్పారు. లాబీయింగ్ తన హాబీ కాదని చెప్పారు. ‘‘లాబీయింగ్ నా హాబీ కాదు. ఇకపై నేను రాజకీయాల్లో ఉండను. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోను. కొత్త అభ్యర్థిని పార్టీ (బీజేపీ) చూసుకోవచ్చు’’ అని మంత్రి కామెంట్ చేశారు. 

బీజేపీ సీనియర్ నేతల కూతుర్లే ముస్లింలను పెళ్లి చేసుకున్నారు.. అది లవ్ జిహాద్ కాదా ? - ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్

బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో పలువురు యువకులు ఈ సారి టికెట్ కేటాయించింది. మొత్తంగా ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు టికెట్ అందించింది. ఈ జాబితాలో 32 మంది ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, 30 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ మార్చింది. ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాగరాజ చబ్బికి కల్ఘట్గి నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. 

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) నుంచి మాజీ ఎమ్మెల్యే వై.సంపంగి కుమార్తె అశ్విని సంపంగి పోటీ చేయనున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సమీప బంధువు ఎన్ఆర్ సంతోష్ కు రెండో జాబితాలో చోటు దక్కలేదు. ఆర్సికెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జీవీ బసవరాజుకు టికెట్ దక్కింది. ముదిగెరె నియోజకవర్గం నుంచి దీపక్ దొడ్డయ్యకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ జాబితాలో ముదిగెరె సిట్టింగ్ ఎమ్మెల్యే కుమార్ స్వామికి చోటు దక్కలేదు.

దేశం కోసం కలిసి నిలబడతాం.. ప్రతిపక్షాలు ఏకం కావడం చారిత్రాత్మక చర్య - కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ

బైందూరు నియోజకవర్గం నుంచి గురురాజ్ గంటిహోళేకు బీజేపీ టికెట్ ఇచ్చింది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే సుకుమార్ శెట్టి స్థానంలో ఆయనను నియమించారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో మదల్ విరూపాక్షప్ప సీటు అయిన చెన్నగిరి నుంచి శివకుమార్ కు టికెట్ దక్కింది. ఈ జాబితాలో మదల్ విరూపాక్షప్ప కుటుంబం నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఇటీవల మదల్ విరూపాక్షప్ప కుటుంబం అవినీతి కేసులో ఇరుక్కోవడంతో ఎఫ్ఐఆర్, లోకాయుక్త దాడులు జరిగాయి.

ఇవేం ఎండలు బాబోయ్.. భానుడి ప్రతాపానికి అహ్మదాబాద్ లో కరిగిన రోడ్డు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు..ఫొటోలు వైరల్

కాగా.. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్, కృష్ణరాజ, శివమొగ్గ, మహదేవపుర తదితర నియోజకవర్గాలతో సహా 12 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం