దహన సంస్కారాలు ముగిసిన 3 రోజుల తర్వాత ప్రాణాలతో తిరిగొచ్చిన వ్యక్తి !

Published : Apr 13, 2023, 11:08 AM IST
దహన సంస్కారాలు ముగిసిన 3 రోజుల తర్వాత ప్రాణాలతో తిరిగొచ్చిన వ్యక్తి !

సారాంశం

Patna: చ‌నిపోయిన వ్య‌క్తి తిరిగొచ్చాడు ! కుటుంబ స‌భ్యులు క‌న్నీటి వీడ్కోలు ప‌లుకుతూ.. దహన సంస్కారాలు పూర్తి చేసిన మూడు  రోజుల తర్వాత ప్రాణాలతో తిరిగొచ్చాడు ఒక వ్య‌క్తి.  ఈ షాకింగ్ ఘ‌ట‌న బీహార్ లో చోటుచేసుకుంది.   

Man returns alive three days after his cremation: ఊహించ‌ని విధ‌మైన కొన్ని సంఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడూ చోటుచేసుకుని షాకింగ్ కు గురిచేస్తుంటాయి. ఇదే త‌ర‌హాలో చ‌నిపోయిన వ్య‌క్తి తిరిగొచ్చాడు ! కుటుంబ స‌భ్యులు క‌న్నీటి వీడ్కోలు ప‌లుకుతూ.. దహన సంస్కారాలు పూర్తి చేసిన మూడు  రోజుల తర్వాత ప్రాణాలతో తిరిగొచ్చాడు ఒక వ్య‌క్తి.  ఈ షాకింగ్ ఘ‌ట‌న బీహార్ లో చోటుచేసుకుంది. పాట్నాలోని దిఘా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. 

వివ‌రాల్లోకెళ్తే.. ద‌హ‌న‌సంస్కారాలు పూర్తి చేసిన మూడు రోజుల త‌ర్వాత‌ పట్నాలోని దిఘా ప్రాంతంలోని భగేదా ఆశ్రమ్ లేన్ లో 65 ఏళ్ల ట్రక్ డ్రైవర్ మంగళవారం తన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. మూడు రోజుల క్రితం దిఘా ఘాట్ వద్ద బ్రిడ్జి నంబర్ 88 సమీపంలో పోలీసులు చ‌నిపోయిన మృత‌దేహాన్ని గుర్తించారు. అయితే, ఈ మృతదేహాన్ని పొరపాటున గుర్తించిన కుటుంబ సభ్యులు దేవన్ రాయ్ అని అంత్యక్రియలు నిర్వహించారు. ట్రక్ డ్రైవర్ హత్యకు స్థానిక నాయకుడు నీలేష్ ముఖియా, అతని సోదరులు సురేష్ ప్రసాద్, ఉమేష్ ప్రసాద్ కారణమని రాయ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

అయితే, అంత్య‌క్రియ‌లు పూర్తయిన త‌ర్వాత మ‌ళ్లీ అదే వ్య‌క్తి తిరిగి రావ‌డంతో స్థానికంగా అంద‌రూ షాక్ కు గుర‌వుతున్నారు.  కుటుంబ స‌భ్యుల‌కు పోలీసులు అప్ప‌గించిన మృత‌దేహం చ‌నిపోయ‌న అస‌లు వ్య‌క్తిది కాద‌ని తెలియ‌డంతో నీలేష్ మద్దతుదారులు ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారు. నీలేష్, అతని కుటుంబాన్ని హత్య కేసులో తప్పుగా ఇరికించినందుకు రాయ్ కుటుంబ సభ్యులను చుట్టుముట్టారు. రాయ్, అతని భార్య చానుదేవి, కోడలిని అదుపులోకి తీసుకుని దిఘా పోలీసులు విచారిస్తున్నారు. శనివారం ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి తన ఆటోలో ఖగౌల్ కు తీసుకెళ్లాడని, ఆ తర్వాత రైలులో కాన్పూర్ కు తీసుకెళ్లాడని రాయ్ పోలీసులకు తెలిపాడు.

అదే వ్యక్తి మంగళవారం అతడిని ఖగౌల్ స్టేషన్ లో దింపి, ఆ తర్వాత మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడని తెలిపారు. మరోవైపు రాయ్ కుటుంబం తన ప్రతిష్టను, తన సోదరులను ఇరికించే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని నీలేష్ ఆరోపించారు. "నిజం అందరి ముందు ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. నకిలీ హత్య కేసులో వారు తనపై తప్పుడు అభియోగాలు మోపారని, ఆ వ్యక్తి తిరిగిరాక‌పోయి వుంటే నేను, నా సోదరుడు అకారణంగా జైలులో ఉండేవాళ్లమని" ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగా, ఏప్రిల్ 9న దిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు రాయ్ కుటుంబ సభ్యులను పిలిపించారు. మృతదేహాన్ని అతనిదిగా నిర్ధారించి హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సరైన విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి డీఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం