Kunal Kamra: ఏక్‌నాథ్ షిండేపై వ్యాఖ్యలకు కమెడియన్ పై శివసేన దాడి

కునాల్ కామ్రా ఓ అద్దె కమెడియన్. డబ్బు కోసం మా నాయకుడిపై కామెంట్లు చేస్తున్నాడు. మహారాష్ట్ర సంగతి దేవుడెరుగు.. కునాల్ కామ్రా భారతదేశంలో ఎక్కడికి స్వేచ్ఛగా వెళ్లలేడు. శివసైనికులు అతనికి సరైన స్థానం చూపిస్తారు. సంజయ్ రౌత్, శివసేన (UBT)కి జాలిపడుతున్నా. మా నాయకుడిపై కామెంట్ చేయడానికి వాళ్ల దగ్గర కార్యకర్తలు, నాయకులు ఎవరూ లేరు. అందుకే కునాల్ కామ్రా లాంటి వాళ్లను పనిలో పెట్టుకున్నారు" అని నరేష్ మస్కే ANIతో అన్నారు.

Shiv Sena Vandalism: Kunal Kamra's Shinde Remarks Spark Outrage

ముంబై (ANI): మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా యూట్యూబ్ వీడియోలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు ఖార్‌లోని హ్యాబిటాట్ కామెడీ క్లబ్‌ను ఆదివారం ధ్వంసం చేశారు.
ఈ వివాదంపై శివసేన ఎంపీ నరేష్ మస్కే స్పందిస్తూ.. కునాల్ కామ్రా డబ్బు కోసం తన పార్టీ నాయకుడిపై వ్యాఖ్యలు చేస్తున్న ఓ అద్దె కమెడియన్ అని అన్నారు.
సంజయ్ రౌత్, శివసేన (UBT) వర్గానికి ఏక్‌నాథ్ షిండేపై కామెంట్ చేయడానికి వేరే కార్యకర్తలు లేక ఇలాంటి వారిని పెట్టుకున్నందుకు జాలిపడుతున్నానని మస్కే అన్నారు.
"కునాల్ కామ్రా ఓ అద్దె కమెడియన్. డబ్బు కోసం మా నాయకుడిపై కామెంట్లు చేస్తున్నాడు. మహారాష్ట్ర సంగతి దేవుడెరుగు.. కునాల్ కామ్రా భారతదేశంలో ఎక్కడికి స్వేచ్ఛగా వెళ్లలేడు. శివసైనికులు అతనికి సరైన స్థానం చూపిస్తారు. సంజయ్ రౌత్, శివసేన (UBT)కి జాలిపడుతున్నా. మా నాయకుడిపై కామెంట్ చేయడానికి వాళ్ల దగ్గర కార్యకర్తలు, నాయకులు ఎవరూ లేరు. అందుకే కునాల్ కామ్రా లాంటి వాళ్లను పనిలో పెట్టుకున్నారు" అని నరేష్ మస్కే ANIతో అన్నారు.
బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాన్ని తాము పాటిస్తామని, కునాల్ కామ్రాకు తగిన సమాధానం చెబుతామని మస్కే అన్నారు. "మేము బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాన్ని అనుసరిస్తాం. కునాల్ కామ్రా మహారాష్ట్రలో కానీ, దేశంలో కానీ స్వేచ్ఛగా తిరగకుండా చూస్తాం. కునాల్ కామ్రాకు తగిన సమాధానం చెబుతాం. అతను వచ్చి తన తప్పుకు క్షమాపణ చెబుతాడు" అని ఆయన అన్నారు.
అయితే, శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయంలో కునాల్ కామ్రాకు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు తన అధికారిక 'X' ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రియమైన కునాల్, ధైర్యంగా ఉండు. నువ్వు ఎవరి గుట్టు రట్టు చేశావో వాళ్లు, వాళ్ల కొనుక్కున్న మనుషులు నీ వెంట పడతారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల మనోభావం ఇదే అని అర్థం చేసుకో! వోల్టేర్ చెప్పినట్లు.. నీ మనసులోని మాటను మాట్లాడే హక్కును కాపాడటానికి నేను మరణించే వరకు పోరాడతాను" అని ప్రియాంక చతుర్వేది 'X'లో పోస్ట్ చేశారు. (ANI)

vuukle one pixel image
click me!