13 రేప్ కేసుల్లో నిందితుడు అరెస్ట్

By ramya neerukondaFirst Published Sep 27, 2018, 3:04 PM IST
Highlights

గత కొద్ది సంవత్సరాలుగా 13మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13 రేప్ కేసుల్లో నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.  కేవలం ఈ రేప్ కేసుల్లో మాత్రమే కాకుండా మరో ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధించినట్లు అతనిపై కేసు ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయి కి చెందిన రెహాన్ ఖురేషి(30) సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు.  గత కొద్ది సంవత్సరాలుగా 13మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం అనూహ్యంగా ఓ సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి ఆచూకీ తెలిసింది. 

ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా నిందితుడు ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పథకం ప్రకారం.. అతను నివసించే ప్రాంతాన్ని గుర్తించి గురువారం అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో కాలంగా ఇతని కోసం గాలిస్తున్నామని.. కాగా ఇప్పుడు చిక్కాడని పోలీసులు తెలిపారు. 

click me!