సరస్వతి ఆత్మహత్య చేసుకుంది.. అరెస్టు నుంచి తప్పించుకోవాలనే శరీరాన్ని ఉడకబెట్టాను - పోలీసులతో మనోజ్ సానే

By Asianet NewsFirst Published Jun 9, 2023, 12:21 PM IST
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సరస్వతి వైద్య హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరస్వతిని తాను చంపలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులతో తెలిపాడు. పోలీసులు తనను నేరస్తుడు అని భావించి, ఇరికిస్తారనే భయంతో ఆమె శరీరాన్ని కోసి, కుక్కర్ లో వేశానని నిందితుడు చెప్పాడు.

తన సహజీవన భాగస్వామి అయిన సరస్వతి వైద్య (32)ను చంపి, ఆపై ఆమె శరీర భాగాలను కోసి ఉడకబెట్టిన కేసులో అరెస్టయిన 56 ఏళ్ల మనోజ్ సానే తాను ఏ నేరం చేయలేదని పోలీసులతో చెప్పాడు. తాను ఆమెను చంపలేదని తెలిపాడు. జూన్ 3న సరస్వతి ఆత్మహత్య చేసుకుందని మనోజ్ విచారణలో పోలీసులకు తెలిపాడు. నేరం తనపైకి వస్తుందనే భయంతో శవాన్ని కోసి కుక్కర్ లో ఉడకబెట్టి పారేశాడని తెలిపారు.

అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం.. డీఆర్ డీవో ను అభినందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

జూన్ 3న తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన జీవిత భాగస్వామి సరస్వతి నోటి నుంచి ఉమ్మి కారుతూ నేలపై పడి ఉండటాన్ని చూశానని మనోజ్ సానే పోలీసుల విచారణలో తెలిపాడు. ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించానని, దీంతో హత్య కేసులో తాను ఇరుక్కుపోకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేశానని మనోజ్ తెలిపాడు. రెండు ట్రీ కట్టర్లతో ఆమె శరీరాన్ని నరికానని, ఆ తర్వాత ఎముకలు, మాంసాన్ని వేరు చేయడానికి ప్రెషర్ కుక్కర్లో అన్ని భాగాలను ఉడకబెట్టానని, దీని వల్ల దుర్వాసన రాకుండా చూశానని పోలీసులకు తెలిపాడు. ఇప్పటికే కొన్ని శరీర భాగాలను తొలగించానని మనోజ్ తెలిపాడు. అయితే ఇలా చేసినందుకు తాను పశ్చాత్తాపం పడటం లేదని చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని పేర్కొన్నాడు. 

కాగా.. సానే గత కొన్ని రోజులుగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నాడని, గతంలో ఎన్నడూ చేయలేదని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మహిళ శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే మనోజ్ సానే చెబుతున్న విషయాలపై తమకు నమ్మకం కుదరడం లేదని పోలీసులు చెప్పారు. నిందితుడు తెలివైన క్రిమినల్ అని పోలీసు పేర్కొన్నారు.

ప్రత్యేక బడ్జెట్ ను నిలిపేసి రైల్వేలను బీజేపీ నాశనం చేసింది - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

పోలీసుల విచారణకు అతడు సహకరించడం లేదని, పలుమార్లు తన వ్యాఖ్యలతో విభేదించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిందితుల వాదనలను ధృవీకరించడం సవాలుతో కూడుకున్నదని, అయితే ఈ జంటకు స్నేహితులు, బంధువులు ఎవరూ లేరని, సాక్షులకు చోటు లేదని అధికారులు తెలిపారు.  కాగా.. సానేపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యాల విధ్వంసం) కింద కేసు నమోదు చేయగా, నేరానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని నయా నగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

ఆరెంజ్ కలర్ లోకి మారిన న్యూయార్క్ ఆకాశం.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్.. అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ?

బాధితురాలు రేషన్ షాపులో పనిచేసే సానేతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. మీరా రోడ్ ఈస్ట్ లోని గీతా ఆకాశ్ దీప్ బిల్డింగ్ లోని ఏడో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 704లో ఈ జంట మూడేళ్లుగా నివసిస్తున్నారు. బుధవారం సానే ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

click me!