మద్యం బాటిల్ ఎత్తుకెళ్లాలని చూసిన దొంగ.. మహిళ ఏం చేసిందంటే..!

Published : Jun 09, 2023, 09:48 AM IST
మద్యం బాటిల్ ఎత్తుకెళ్లాలని చూసిన దొంగ.. మహిళ ఏం చేసిందంటే..!

సారాంశం

చాలా సేపు అన్ని బాటిళ్లు చూసిన తర్వాత.. అందులో మంచి కాస్ట్ లీ బాటిల్ ని ఎంచుకున్నాడు. డబ్బులు కట్టడానికి వచ్చినట్లే వచ్చి పారిపోవడానికి ప్రయత్నించాడు.


దొంగలు ఎక్కడికి వెళ్లినా, తమ బుద్ధి చూపించకుండా ఉండలేరు.  ఎలా దొంగతనం చేయాలా అని చూస్తూ ఉంటారు. తాజాగా ఓ దొంగ ఓ మద్యం దుకాణంలో మంచి సీసాను కాజేయాలని చూశాడు. కానీ ఓ మహిళ వారిని ప్లాన్ ని బోల్తా కొట్టించింది. ఈ సంఘటన ఎక్కడి జరిగింది అనే విషయం తెలియదు కానీ, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఓ దొంగ మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ అన్ని మందు బాటిళ్లు చూశాడు. చాలా సేపు అన్ని బాటిళ్లు చూసిన తర్వాత.. అందులో మంచి కాస్ట్ లీ బాటిల్ ని ఎంచుకున్నాడు. డబ్బులు కట్టడానికి వచ్చినట్లే వచ్చి పారిపోవడానికి ప్రయత్నించాడు.

అయితే, అతను చేసే పనిని ముందుగానే కనిపెట్టిన ఆ దుకాణంలోని మహిళ అతని ఆట కట్టించింది.  వెంటనే వెళ్లి, ఆ రూమ్ డోర్ లాక్ చేసింది. ఇంకేముంది అతను పారిపోవడానికి లేకుండా పోయింది. దొంగ దొరికిపోయాడు. ఇంకేముంది వెంటనే మళ్లీ బ్యాక్ క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి బాటిల్ రిటర్న్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత దొంగ ని ఏం చేశారు అనేది వీడియోలో చూపించలేదు కానీ వీడియో మాత్రం వైరల్ గా మారింది.

నెటిన్ల రియాక్షన్ మాత్రం మామూలుగా లేదు. ఆ మహిళ తెలివిని మెచ్చుకుంటున్నారు. ఇక ఆ దొంగ తెలివిలేని తనాన్ని చూసి నవ్వుకుంటున్నారు. దొంగను చూస్తే జాలేస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?