ఇక నుండి క్రమశిక్షణతో ఉంటా: సాధ్వి ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్‌

By narsimha lodeFirst Published Jun 5, 2019, 4:13 PM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్‌ క్రమశిక్షణతో మెలుగుతానని ప్రకటించారు. పార్టీ విధానాలను గౌరవిస్తూ విధేయతతో ఉంటానని హామీ ఇచ్చారు

భోపాల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్‌ క్రమశిక్షణతో మెలుగుతానని ప్రకటించారు. పార్టీ విధానాలను గౌరవిస్తూ విధేయతతో ఉంటానని హామీ ఇచ్చారు.

2008 మాలేగావ్ పేలుళ్ల కేసుల్లో ప్రఙ్ఞా సింగ్‌  ఠాకూర్ భోపాల్ ఎంపీగా విజయం సాధించారు.  ఎన్నికల ప్రచార సమయంలో సాధ్వి ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్‌  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను  విచారించిన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే‌ తన శాపం కారణంగానే ఉగ్రవాదుల చేతుల్లో మృతి చెందారని ఆమె వ్యాఖ్యానించారు. 

మహాత్మాగాంధీని చంపిన గాడ్సేని నిజమైన  దేశభక్తుడుగా ఆమె అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు బీజేపీ నాయకత్వం సీరియస్‌గా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని  కూడ బీజేపీ నాయకత్వం సాధ్విని కోరిన విషయం తెలిసిందిే.

ఈ పరిణామాల నేపథ్యంలో  సాద్వి వెనక్కు తగ్గింది. ఇక నుండి క్రమశిక్షణతో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. అవకాశం ఇస్తే ప్రధానమంత్రి మోడీని కలుస్తానని ఆమె తేల్చి చెప్పారు.


 

click me!