Omicron: దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Omicron: చైనాలోని వూహాన్ నగరంలో 2019 లో కరోనా మహమ్మారి వెలుగుచూసింది. అప్పటి నుంచి ఈ వేరియంట్ యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నది. అయినప్పటికీ ఈ వైరస్ ప్రభావం తగ్గడం లేదు. దీని కట్టడి కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా టీకాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటిని తట్టుకునే విధంగా కరోనా వైరస్ అనేక మ్యుటేషన్లకు లోనవుతూ.. మరింత ప్రమాకరంగా మారుతున్నది. ఇప్పటికే కరోనా ప్రమాదకరమైన వేరియంట్ డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కారణంగా భారత్ లో కోవిడ్-19 సెకండ్ వేవ్ వచ్చింది. దీని కారణంగా అనేక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు వీటి కంటే అత్యంత ప్రమాకరమైన కరోనా వైరస్ వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ ప్రపంచంలోని చాలా దేశాల్లో పంజా విసురుతోంది. భారత్ లోనూ రోజురోజుకూ ఈ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ వేరియంట్ కట్టడి కోసం చర్యలను వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు విధించగా, మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నాయి.
Also Read: సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ.. 12 గంటల్లో స్పందించకుంటే...
undefined
కరోనా వైరస్ వేరియంట్ డెల్టా తర్వత మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ పట్టి పీడిస్తుండటంతో భయాందోళన నెలకొంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఒమిక్రాన్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు తీసుకుంటున్నాయి. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు చేపట్టే విధంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ విధించారు. గుజరాత్‌లోని 9 నగరాల్లో నైట్ కర్ప్యూ విధించనున్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేసేందుకు అక్కడి సర్కారు సిద్ధమైంది. కర్నాటక సైతం ఇప్పటికే కొత్త సంవత్సరం, క్రిస్మస్ వేడుకలపై నిషేధం విధించింది. అలాగే, రాష్ట్రంలో సామూహిక వేడుకలు రద్దు చేసింది. ఉత్తరప్రేదశ్‌లో సీఎం యోగి అదిత్యానాథ్ సర్కారు సైతం ఈనెల 31 వరకు 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ సాధారణ కేసులు అధికంగా నమోదవుతున్న కేరళలోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నారు.
Also Read: Round-up 2021 | చరిత్రలో మర్చిపోలేని ఏడాది.. అనేక విషాదాలకు నిలువుటద్దం 2021 !
ఒమిక్రాన్ వేరియంట్ కొత్త కేసులు పెరుగుతుండటం, దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడం, ఇతర దేశాల్లో పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కొత్తగా కోవిడ్-19 మార్గదర్శకాలను విడుదల చేసింది. వైరస్ కట్టడికి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచనలు చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని సూచించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ఉన్నందున ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆందులో పేర్కొంది. కేసుల పెరిగినా అందులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ భారత్ లో లాక్ డౌన్ విధించినున్నారా? అంటూ లాక్‌డౌన్ రోజులను గుర్తుచేసుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేరియంట్ వల్ల జీవనోపాధి దెబ్బతిస్తుందని భయాందోళన చెందుతున్నారు. అలాగే, కరోనా కారణంగా పిల్లల చదువుల నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న పాఠశాలలు, విద్యా సంస్థలు మళ్లీ ఒమిక్రాన్ పంజాతో మూత పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే.. దేశం మొత్తం లాక్‌డౌన్ విధించకపోయినా.. కరోనా కేసులు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను మరింత కఠినంగా మర్చే దిశగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: Rahul Gandhi : బూస్టర్ డోసులు ఎప్పుడంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్