రూ. 5 కోట్లు పలికిన గుర్రం.. ఇంకా ధర వస్తుందని అమ్మడానికి నో చెప్పిన యజమాని.. స్పెషల్ ఏంటంటే..

Published : Dec 24, 2021, 09:18 AM IST
రూ. 5 కోట్లు పలికిన గుర్రం.. ఇంకా ధర వస్తుందని అమ్మడానికి నో చెప్పిన యజమాని.. స్పెషల్ ఏంటంటే..

సారాంశం

ఇది marwar జాతికి చెందిన అరుదైన గుర్రం. 68 అంగుళాల ఎత్తు ఉంది. రోజుకు 10 లీటర్ల పాలు, కేజీ నెయ్యి, 5 గుడ్లు,  చిరుధాన్యాలు, తవుడు, డ్రై ఫ్రూట్స్ తింటుంది. ఈసారి నాలుగు రోజుల్లోనే 278 గుర్రాలు అమ్ముడుపోయాయి.

నందుర్బర్ :  మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లా Sarang Khed Market స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.  వేర్వేరు జాతుల  Horses ఇక్కడ అమ్మకానికి వస్తాయి.  నాసిక్ నుంచి వచ్చిన రావణ్ అనే పేరున్న గుర్రానికి రూ. 5 కోట్లు ఇచ్చి కొనేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చినా అమ్మేందుకు దాని యజమాని అసద్ సయ్యద్ నిరాకరించారు.

ఇంకా మంచి ధర వస్తుందనే నమ్మకమే దీనికి కారణం. ఇది marwar జాతికి చెందిన అరుదైన గుర్రం. 68 అంగుళాల ఎత్తు ఉంది. రోజుకు 10 లీటర్ల పాలు, కేజీ నెయ్యి, 5 గుడ్లు,  చిరుధాన్యాలు, తవుడు, డ్రై ఫ్రూట్స్ తింటుంది. ఈసారి నాలుగు రోజుల్లోనే 278 గుర్రాలు అమ్ముడుపోయాయి.

ఇదిలా ఉండగా, 2021 ఏప్రిల్ లో కరోనా తీవ్రదశలో ఉన్న సమయంలో తెలంగాణ హై కోర్టు గుర్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సూచన చేసింది.  కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ వ్యాధితో మరణించినవారి శవాలను తరలించడానికి గుర్రాలను వాడాలని ఆదేశించింది. మాస్క్ ధరించకపోతే వేయి రూపాయల చొప్పున జరిమానా విధించాలని కూడా సూచించింది. 

కరోవా కట్టడికి తాము తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాత్రి కర్ఫ్యూ విధించడమే కాకుండా సోషల్ గ్యాదరింగ్స్ లో వ్యక్తులు గుమికూడడాన్ని 50 శాతం తగ్గించాలని ఆదోసించింది. 

ప్రజలు ఎలా గుమికూడుతున్నారో లిక్కర్ షాపుల వద్ద చూడాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్ లు దోపిడీని అరికట్టాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి ఎంతగా ఉందో 108, 104 నెంబర్లకు వస్తున్న కాల్స్ ను చూస్తే అర్థమవుతుందని చెప్పింది. తెలంగాణలో మరిన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 

మందు బాబులకు షాక్.. న్యూయర్ నాడు లిక్కర్ బంద్..

తెలంగాణకు సరపడినంత ఆక్సిజన్ సరఫరా చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించాలని సూచించింది. ప్రైవేట్ అస్పత్రులన్నీ రిపోర్టులు కూడా చూడకుండా వైద్యం అందించాలని సూచించింది. వృద్ధులకు, దివ్యాంగులకు చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. విచారణను వారం పాటు వాదియా వేసింది. 

సామాజిక దూరం పాటించకుండా కరోనా నిబంధనలను పాటించనివారిపై కేసులు పెట్టడం లేదని హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ తగిన ప్రణాళికను అమలు చేయడం లేదని తప్పు పట్టింది. సోషల్ డిస్టెన్స్ మీద నాలుగు కేసులు, పెద్ద యెత్తున గుమికూడడంపై రెండు కేసులు మాత్రమే నమోదు చేయడం పట్ల హైకోర్టు పోలీసులను తప్పు పట్టింది. 
 

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?