మందు బాబులకు షాక్.. న్యూ ఇయర్ నాడు లిక్కర్ బంద్..

Published : Dec 24, 2021, 08:46 AM ISTUpdated : Dec 24, 2021, 10:08 AM IST
మందు బాబులకు షాక్.. న్యూ ఇయర్ నాడు లిక్కర్ బంద్..

సారాంశం

మేఘాలయాలో మాత్రం ఈ నెల 24, 25 తేదీలలో పాటు కొత్త సంవత్సరం మొదటి రోజైన జనవరి 1న కూడా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించి మందు బాబులకు షాక్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ నిషేధం రాష్ట్రం మొత్తం లేకుండా east khasi hills జిల్లాలో మాత్రమే ఉండనున్నట్లు పేర్కొంది. 

షిల్లాంగ్ :  మరి కొద్ది రోజులలో 2021 ఏడాది ముగియనుంది.  అయితే ఈ క్రమంలో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి జనాలు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. అయితే మరో వైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ Omicron కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే Meghalaya రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఏడాది చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు liquor గిరాకీ బాగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే.

అయితే మేఘాలయాలో మాత్రం ఈ నెల 24, 25 తేదీలలో పాటు కొత్త సంవత్సరం మొదటి రోజైన జనవరి 1న కూడా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించి మందు బాబులకు షాక్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ నిషేధం రాష్ట్రం మొత్తం లేకుండా east khasi hills జిల్లాలో మాత్రమే ఉండనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి జీవోను మేఘాలయ ప్రభుత్వం బుధవారం జారీ చేసింది.

ఉత్తరాఖండ్ లో మొదటి ఒమిక్రాన్ కేసు.. నైట్ కర్ఫ్యూ, కోవిడ్ ఆంక్షల దిశగా చర్యలు..

ఇదిలా ఉండగా, గురువారం తెలంగాణ హైకోర్టు న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలపై ఆదేశాలు జారీ చేసింది. న్యూఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది. కరోనాపై  Telangana High Court  గురువారం నాడు విచారణ నిర్వహించింది.

ఈ విచారణ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. Maharashtra,delhi ప్రభుత్వాల మాదిరిగానే New year, christmas వేడుకలపై ఆంక్షలను పెట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. జనం గుంపులుగా ఉండకుండా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని కోరింది. ఎయిర్‌పోర్టు్లో ఉన్నట్టుగానే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి  పరీక్షలు నిర్వహించాలని కూడా హైకోర్టు తెలంగాన ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. 

క్రిస్‌మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

బహిరంగ ప్రదేశాలకు జనం వచ్చే సమయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. వేడుకలు నిర్వహణ సమయంలో కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారంతా మాస్క్ తప్పనిసరిగా ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ మాస్క్ ధరించకపోతే భారీ జరిమానాను విధించాలని కూడా ఆదేశించింది.రెండు , మూడు రోజుల్లో ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని కూడా హైకోర్టు సూచించింది. 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu