రాహుల్ గాంధీ ఓబీసీ వర్గాన్ని అవమానించారు - కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

Published : Mar 24, 2023, 12:35 PM IST
రాహుల్ గాంధీ ఓబీసీ వర్గాన్ని అవమానించారు - కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

సారాంశం

కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఓబీసీలను అవమానపర్చారని, విదేశాల్లో భారత్ ను కించపర్చారని అన్నారు. 

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత న్యాయ వ్యవస్థను అవమానించారని, విదేశీ గడ్డపై భారత్ ను అవమానించారని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ విమర్శించారు. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో 2019లో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై ఆయను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఓబీసీ వర్గాన్ని అవమానించారని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ వారసుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని ఆయన ఉద్ఘాటించారు.

తెలంగాణ, పశ్చిమ బెంగాల్ తో సహా 9 రాష్ట్రాలు సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి - రాజ్యసభలో కేంద్రం

‘‘ఓబీసీ వర్గాన్ని కించపరిచే హక్కు ఏ రాజకీయ నాయకుడికీ లేదన్నారు. నాయకుడి ఈ ప్రవర్తన భరత్ జోడోను కాకుండా భరత్ తోడోను చూపిస్తుంది. చట్టపరమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏ ఇంటిపేరునైనా అవమానించడం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదు’’ అని భూపేందర్ యాదవ్ అన్నారు.

రాహుల్ గాంధీ ప్రవర్తన భారత్ జోడో ను కాకుండా భారత్ తోడోను నమ్ముతారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడం, ఓబీసీ వర్గాన్ని అవమానించడం, విదేశీ గడ్డపై దేశాన్ని కించపరచడం రాహుల్ గాంధీ నైజం అని అన్నారు. ఓబీసీ కమ్యూనిటీ ఇంటిపేరును గాంధీ నిరంతరం అవమానించారని అన్నారు. అంతే కాదు విదేశీ గడ్డపై దేశాన్ని కించపరిచారని తెలిపారు. న్యాయవ్యవస్థను ఆయన కించపరుస్తున్నారని యాదవ్ అన్నారు.

మత్తుమందు ఇచ్చి 5వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, స్కూల్ ప్యూన్ అరెస్ట్

మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించి 2019లో దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అధి నాయకుడు ప్రసంగిస్తూ.. ‘రాహుల్ గాంధీ దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది’’ అని వ్యాఖ్యలు చేశారు. 

శ్రీరామునిపై జ‌మ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

‘‘నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ... వారందరికీ మోడీని ఒక ఉమ్మడి ఇంటిపేరుగా ఎలా కలిగి ఉన్నారు? దొంగలందరికీ మోడీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది?’’ అని ఆయన ప్రశ్నించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు. కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. తీర్పు వెలువరించే సమయంలో కోర్టుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని న్యాయమూర్తికి చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు