ఈడీ, సీబీఐ దర్యాప్తులు: సుప్రీంకోర్టులో 14 విపక్ష పార్టీల పిటిషన్

Published : Mar 24, 2023, 11:33 AM ISTUpdated : Mar 24, 2023, 11:54 AM IST
ఈడీ, సీబీఐ దర్యాప్తులు: సుప్రీంకోర్టులో 14  విపక్ష పార్టీల  పిటిషన్

సారాంశం

ఈడీ, సీబీఐ దర్యాప్తులపై  విపక్ష పార్టీలు  సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విషయమై మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా  కోరాయి. 

న్యూఢిల్లీ:  ఈడీ, సీబీఐ  ఏకపక్ష దర్యాప్తులపై  సుప్రీంకోర్టులో  14 విపక్ష పార్టీలు  శుక్రవారంనాడు  పిటిషన్ దాఖలు  చేశాయి.  అరెస్ట్‌కు ముందు  అరెస్ట్  తర్వాత  మార్గదర్శకాలను  ఆ పిటిషన్ లో  కోరాయి  14 పార్టీలు.   

బీజేపీయేతర  పార్టీలకు చెందిన  నేతలపై  ఏకపక్షంగా  సీబీఐ, ఈడీలను  కేంద్రం ఉపయోగిస్తుందని  14 పార్టీలు  ఆ పిటిషన్ లో  పేర్కొన్నాయి.  కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని  14 పార్టీలు  ఈ పిటిషన్ ను దాఖలు  చేశాయి. 

 డీఎంకె, ఆర్‌జెడీ , భారత రాష్ట్ర సమితి, తృణమూల్  కాంగ్రెస్ పార్టీలు  ఈ పిటిషన్ పై సంతకం  చేశాయి.  విపక్ష పార్టీల తరపున  సీనియర్ న్యాయవాది  అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో వాదలను  విన్పించారు.   సీజేఐ  డివై చంద్రచూడ్  నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఏప్రిల్ 5న విచారణ  చేయనుందని సుప్రీంకోర్టు  తెలిపింది.ఈడీ, సీబీఐ కేసులు  95 శాతం  విపక్ష పార్టీల నేతలపైనే ఉన్నాయని సుప్రీంకోర్టుకు  అభిషేక్ మను సింఘ్వి  చెప్పారు.  అరెస్ట్ కు ముందు , అరెస్ట్  తర్వాత మార్గదర్శకాలను  సుప్రీంకోర్టు ను  సింఘ్వి  అడిగారు. 

నరేంద్ర మోడీపై  రాహుల్ గాంధీ 2019లో  వివాదాస్పద వ్యాఖ్యలు  చేసిన కేసులో  నిన్న  సూరత్ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.ఈ కేసులో రాహుల్ గాంధీకి  రెండేళ్ల  జైలు శిక్షను విధించింది  కోర్టు.   ఆ తర్వాత  బెయిల్  కూడా  ఇచ్చింది  కోర్టు.  ఈ ఘటనను బీజేపీయేతర  పార్టీల  నేతలు, సీఎంలు ఖండించారు.  ఈ విషయమై  ఇవాళ  బీజేపీయేతర పార్టీలతో  కాంగెస్ పార్టీ సమావేశం  ఏర్పాటు  చేసింది.  ఈ సమయంలోనే  సుప్రీంకోర్టులో 14 పార్టీలు పిటిషన్ దాఖలు  చేశాయి. 

ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను  ఉపయోగించి  విపక్ష నేతలను  ఇబ్బంది పెడుతున్నారని  బీజేపీయేతర పార్టీలు విమర్శించాయి.ఈ విషయమై ప్రధాని మోడీకి  ఈ పార్టీలు  ఇటీవలనే  లేఖను రాసిన విషయం తెలిసిందే.  మనీష్ సిసోడియాను  అరెస్ట్ చేసిన  తర్వాత  ఈ లేఖను  విపక్ష పార్టీలు  ప్రధానికి లేఖ  రాశాయి.

2024 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  దర్యాప్తు సంస్థల దుర్వినియోగం  మరింత పెరిగే అవకాశం ఉందని  విపక్షపార్టీలు ఆందోళన వ్యక్తం  చేస్తున్నాయి 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?