
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో (5 state elections) పంజాబ్ (punjab polls 2022) కూడా ఒకటి. అత్యంత కీలకమైన ఈ రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్ (congress), పాగా వేయాలని ఆప్ (aap), బీజేపీ (bjp), శిరోమణి అకాలీదళ్ (shiromani akali dal) పావులు కదుపుతున్నాయి. మరి అక్కడ ఎవరు గద్దెనెక్కనున్నారనే దానిపై ఇండియా న్యూస్- జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ (india news jan ki baat opinion poll)నిర్వహించింది. దీని ప్రకారం.. అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) సారథ్యంలోని ఆప్.. కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించనుందని సర్వే అంచనా వేసింది.
జన్ కీ బాత్ పోల్ ప్రకారం.. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 50 నుంచి 57 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పంజాబ్‌లో 20 సీట్లు గెలుచుకున్న ఆప్‌కి ఇది భారీ లాభమే. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్ధితి లేకపోవడంతో 2017తో పోలిస్తే 30 స్థానాలను కోల్పోయి 40-46 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వేలో తేలింది. శిరోమణి అకాలీదళ్ మరోసారి 2017 (18 సీట్లు) నాటి ఫలితాలనే పునరావతం చేస్తుందని .. కాకపోతే ఈసారి 16 నుంచి 21 సీట్లు వచ్చే అవకాశం వుందని ఒపీనియన్ పోల్ తేల్చింది. బీజేపీకి కేవలం నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.
ఓట్ల వాటా విషయానికి వస్తే.. రాష్ట్రంలోని 10 వేల మంది ప్రజల అభిప్రాయాలను తీసుకున్న జన్‌కీ బాత్ పోల్.. ఆప్‌కి 37.8 శాతం, కాంగ్రెస్‌కు 34.7 శాతం, శిరోమణి అకాలీదళ్‌కు 20.5 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. ప్రస్తుత కాంగ్రెస్ పనితీరు బాగుందని 55 శాతం మంది అభిప్రాయపడగా.. మంచి పరిపాలన అందించడంలో విఫలమైందని మరో 20 శాతం మంది అభిప్రాయపడ్డారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతులు చేసిన నిరసన పంజాబ్ విషయానికి వస్తే ఒక భావోద్వేగ సమస్య. 2022 ఎన్నికల తీర్పుపై ఆ అంశం భారీగా ప్రభావాన్ని చూపుతుందని 70 శాతం మంది ప్రజలు విశ్వసించారు. రైతు నిరసనలు కాకుండా ప్రస్తుతమున్న అతిపెద్ద సమస్యలలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధానమైనవని 20 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 18 శాతం మంది అభివృద్ధి ముఖ్యమనగా, 15 శాతం మంది విద్యను, 10 శాతం మంది డ్రగ్స్‌ను పార్టీలు ప్రధానంగా లేవనెత్తుతాయని ఒపీనియన్ పోల్ అభిప్రాయపడింది.
జన్ కీ బాత్ సర్వేలో ఆప్‌కి అనుకూలంగా కమ్యూనిటీ ఓట్లలో గణనీయమైన మార్పు కనిపించింది. ఇతర వెనుకబడిన తరగతుల ఓటర్లలో 35 శాతం మంది ఆప్ ప్రభుత్వంపై మొగ్గు చూపగా, కేవలం 30 శాతం మంది కాంగ్రెస్‌కు, 20 శాతం మంది బీజేపీ వైపు మొగ్గుచూపారు. అదే సమయంలో 45 శాతం మంది జాట్ సిక్కు ఓటర్లు ఆప్‌కి ఓటేశారు. తర్వాత కాంగ్రెస్ (25 శాతం), శిరోమణి అకాలీదళ్ (20 శాతం) బీజేపీ కూటమి (10శాతం) వున్నారు. కాంగ్రెస్‌కు షెడ్యూల్డ్ కులాల ఓటర్లు మాత్రమే అనుకూలంగా వున్నారు . మొత్తం ఈ వర్గం జనాభాలో 48 శాతం మంది హస్తం పార్టీని సమర్థించారు. ఆ తర్వాత ఆప్ (40 శాతం), అకాలీదళ్ (8 శాతం), బీజేపీ కూటమి (4 శాతం) వున్నాయి.