వ్యభిచారం నేరం కాదు.. బాంబే హైకోర్టు షాకింగ్ కామెంట్స్

By telugu news teamFirst Published Sep 26, 2020, 3:05 PM IST
Highlights

గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఓ గెస్ట్‌హౌజ్‌ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారని తెలిసి.. పోలీసులు దాడి చేశారు.  ముగ్గురు మ‌హిళ‌ల‌ను, మ‌ధ్య‌వ‌ర్తిని అదుపులోకి తీసుకున్నారు. ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.


వ్యభిచారం నేరం కాదంటూ బాంబే హైకోర్టు షాకింగ్ తీర్పు వెల్లడించింది. మహిళకు తన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని తెలుపుతూ.. పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు సెక్స్ వర్కర్లను తక్షణమే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గురువారం జారీ చేసిన ఉత్తర్వులో జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ ఈ తీర్పును వెల్లడించారు.

కాగా.. 1956 అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం ప్రకారం వ్యభిచారం నేరపూరిత చ‌ర్య‌గా పరిగణించలేదన్నారు. మజ్గావ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ముగ్గురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ చవాన్ విచారించి తీర్పును ప్ర‌క‌టించారు. 

గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఓ గెస్ట్‌హౌజ్‌ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారని తెలిసి.. పోలీసులు దాడి చేశారు.  ముగ్గురు మ‌హిళ‌ల‌ను, మ‌ధ్య‌వ‌ర్తిని అదుపులోకి తీసుకున్నారు. ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. బాధితులుగా పేర్కొన్న ముగ్గురు మ‌హిళ‌ల‌ను ప‌రివ‌ర్త‌న మార్పు కింద ఓ ఆశ్ర‌మానికి త‌ర‌లించారు. కాగా వీరి త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌కులు త‌మ పిల్ల‌ల్ని అప్ప‌గించాల్సిందిగా కోరుతూ మేజిస్ర్టేట్ కోర్టును ఆశ్ర‌యించారు. వీరి విజ్ఞ‌ప్తిని న్యాయ‌స్థానం తోసిపుచ్చింది. అప్పిల్‌కు వెళ్ల‌గా మేజిస్ట్రేట్ ఆదేశాన్ని ప‌క్క‌న పెట్టి జస్టిస్ చవాన్ తీర్పును వెలువ‌రించారు. 

స‌ద‌రు మ‌హిళ‌లు మేజ‌ర్స్‌. స్వేచ్ఛగా సంచ‌రించేందుకు, వారికి ఇష్ట‌మైన వృత్తిని ఎన్నుకునే ప్రాథమిక హక్కుకు వారు అర్హులు అని పేర్కొన్నారు.

click me!