మాజీ ప్రియురాలి వివాహానికి హాజరైన ప్రిన్స్ విలియం.. ఆశ్చర్యానికి గురైన అభిమానులు

Published : Dec 19, 2022, 11:32 AM IST
మాజీ ప్రియురాలి వివాహానికి హాజరైన ప్రిన్స్ విలియం.. ఆశ్చర్యానికి గురైన అభిమానులు

సారాంశం

మాజీ ప్రియురాలి వివాహానికి హాజరై ప్రిన్స్ విలియం తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. గ్లౌసెస్టర్‌షైర్‌లోని సెయింట్ మేరీ ది వర్జిన్ చర్చిలో ఈ పెళ్లి జరిగింది. 

ప్రిన్స్ విలియం తన మాజీ ప్రేయసి వివాహానికి హాజరై తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు.  గ్లౌసెస్టర్‌షైర్‌లోని సెయింట్ మేరీ ది వర్జిన్ చర్చిలో మాజీ ప్రియురాలైన రోజ్ ఫర్ఖర్, జార్జ్ జెమ్మెల్ వివాహంలో కొత్త యువరాజు కనిపించాడని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

21 ఏళ్ల తర్వాత మిసెస్‌ వరల్డ్‌‌ కిరీటాన్ని కైవసం చేసుకున్న జమ్మూ కాశ్మీర్ భామ..

ప్రస్తుత పెళ్లికూతురు ఫర్ఖర్, ప్రిన్స్ విలయంలు గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. వీరిద్దరూ యూనివర్సిటీలో చదివే సమయంలో 18 ఏళ్ల వయస్సుల్లో డేటింగ్ చేయడం ప్రారంభించారు. విల్స్ ఈటన్ లో తన ఎ-లెవల్స్ పూర్తి చేసిన తర్వాత గ్లౌసెస్టర్‌షైర్‌లోని బ్యూఫోర్ట్ పోలో క్లబ్ లో కలుసుకున్నారు. అయితే ఈ జంట చివరికి విడిపోయింది. స్నేహితులుగా మిగిలిపోయారు.

ఆప్ ఒక బూటకపు పార్టీ.. కేజ్రీవాల్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు: బీజేపీ

వీరిద్దరూ విడిపోయిన తరువాత ఫర్ఖర్ లీ  స్ట్రాస్‌బర్గ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనను నేర్చుకునేందుకు న్యూయార్క్ వెళ్లారు. ఆమె 2006లో అప్పటి బీబీసీ షో ‘ది వాయిస్’లో ఉన్నప్పుడు వార్తల్లో నిలిచింది. కానీ చివరికి ఆడిషన్స్ వేదికను దాటలేదు.

ఐర్లాండ్ ప్ర‌ధానిగా భార‌త సంత‌తి వ్య‌క్తి లియో వరద్కర్.. ప్రధాని మోదీ అభినందనలు

అయితే ఈ వివాహం సందర్భంగా.. ప్రిన్స్ విలియం బ్లాక్ టక్సిడో, దానికి సరిపోయే బౌటీ ధరించారు. కానీ ఆయన తన భార్య కేట్ మిడిల్టన్ ను వెంట తీసుకురాలేదు. ఆయన ఒంటరిగానే ఈ వేడుకకు వచ్చారు.

ఇదిలా ఉండగా ప్రిన్స్ విలియం.. తన సోదరుడు రూపొందించిన ‘డ్యూక్ ఆఫ్ ససెక్స్’ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వివాదాస్పద ఆయన ఈ వివాహానికి హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2020 జనవరిలో రాజకుటుంబం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ ప్రకటించిన వెంటనే జరిగిన కుటుంబ సమావేశంలో ప్రిన్స్ విలియం సహనం కోల్పోయారని ఆయన తన డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !