పెళ్లి బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు...

Published : Dec 19, 2022, 11:16 AM IST
పెళ్లి బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు...

సారాంశం

మహారాష్ట్రలో ఓ పెళ్లి బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. 

ముంబై : ముంబైలోని రాయగఢ్‌లో ప్రైవేట్ బస్సు, కంటైనర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంబైకి ఆనుకుని ఉన్న రాయగఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు రాయ్‌గఢ్ పోలీసులు తెలిపారు.

"సింధుదుర్గ్‌లో వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న ప్రైవేట్ వోల్వో బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు, వారిలో 10 మంది గాయపడ్డారు" అని పోలీసు అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్
Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.