న్యూయార్క్ హౌస్ అగ్నిప్రమాదం.. ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త మృతి..

By SumaBala BukkaFirst Published Dec 19, 2022, 10:48 AM IST
Highlights

న్యూయార్క్ లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త ఒకరు మృత్యువాత పడ్డారు. ఆమె ఇటీవలే డంకెన్ డోనట్స్ అవుట్ లెట్ ప్రారంభించారు. 

న్యూయార్క్‌ : అమెరికాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్‌లో ఓ ఇండో అమెరికన్ ఎంటర్ ప్రెన్యూవర్, ఆమె పెంపుడు కుక్క మంటలకు ఆహుతయ్యారు. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని డిక్స్ హిల్స్ కాటేజ్‌లో మంటలు చెలరేగడంతో 32 ఏళ్ల తాన్యా బతిజా,  ఆమె పెంపుడు కుక్క మరణించింది. డిసెంబర్ 14న ఈ ఘటన జరిగింది.మంటల్లో చిక్కుకున్న తాన్యా బతిజా అక్కడికక్కడే మరణించారు. మంటలు చెలరేగడంతో కమ్ముకున్న పొగ కారణంగా పోలీసు అధికారులు ఇంట్లోకి ప్రవేశించలేకపోయారు.

పెట్రోలింగ్ అధికారులకు ఆ రోజు తెల్లవారుజామున 2.53 గంటలకు మంటలకు సంబంధించి ఫోన్ కాల్‌కు వచ్చింది. ఈ కేసును పరిశీలిస్తున్న సఫోల్క్ కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ మాత్రం దీంట్లో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని తోసిపుచ్చింది. "తాన్యా బతిజా కార్ల్స్ స్ట్రెయిట్ పాత్‌లోని తన తల్లిదండ్రుల ఇంటి వెనుక ఉన్న కాటేజ్‌లో నివసిస్తుంది" అని పోలీసులు చెప్పారు. బతిజా ఇటీవల లాంగ్ ఐలాండ్‌లోని బెల్‌పోర్ట్‌లో డంకిన్ డోనట్స్ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. అకౌంటింగ్, ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె డంకిన్ డోనట్స్ అవుట్‌లెట్‌ రంగంలోకి ప్రవేశించారు. 

దారుణం.. 4 కుక్క పిల్లలను ఉద్దేశపూర్వకంగా కారుతో గుద్దిన డ్రైవర్.. అరెస్టు చేసిన పోలీసులు

బతీజా తండ్రి గోవింద్ బతిజా ప్రతీరోజు లాగే ఉదయం వాకింగ్ కోసం లేచారు. ఆ సమయంలో ఆయన ఈ మంటలను గుర్తించి వెంటనే 911కి డయల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గోవింద్ బతిజా వ్యాపారవేత్త, కమ్యూనిటీ లీడర్ కూడా. మంటలు చూసి అలర్ట్ అయిన గోవింద్ బతిజా వెంటనే భార్యను లేపారు. ఆ తరువాత 911 కాల్ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కాటేజ్ లోకి వెళ్లి.. బతీజాను రక్షంచాలని ప్రయత్నించారు. కానీ కాటేజ్ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోవడంవల్ల అది వారికి సాధ్యపడలేదు అని పోలీసులు తెలిపారు.

మరికొన్ని వార్తాకథనాల ప్రకారం.. బతీజాను కాపాడేందుకు ప్రయత్నించిన పెట్రోలింగ్ అధికారుల్లో ఒకరు అస్వస్థతను గురయ్యారు.మంటల కారణంగా ఏర్పడిన పొగతో ఊపిరాడక అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను వెంటనే స్టోనీ బ్రూక్ యూనివర్శిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డిక్స్ హిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ, 60 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సభ్యలు "మంటలను అదుపు చేయడం కోసం’’ ప్రయత్నిస్తున్నారు. తాన్యా బతిజా అంత్యక్రియలు రొంకోంకోమా సరస్సులోని మలోనీస్ లేక్ ఫ్యూనరల్ హోమ్ అండ్ క్రిమేషన్ సెంటర్‌లో జరుగుతాయని నివేదిక పేర్కొంది.

click me!