నేడు అయోధ్యకు ప్రధాని మోడీ.. మహా సంప్రోక్షణ వేడుకలకు రిహార్సల్‌ గా...

By SumaBala BukkaFirst Published Dec 30, 2023, 7:25 AM IST
Highlights

శనివారం ఉదయం 10 గంటలకు ప్రధాని అయోధ్యలోని విమానాశ్రయంలో దిగే అవకాశం ఉంది, ఆ తర్వాత ఆయన అయోధ్య ధామ్ జంక్షన్‌కు వెళతారు. అక్కడ అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను పరిశీలించి, ప్రారంభిస్తారు. విమానాశ్రయం నుండి రైల్వే స్టేషన్ వరకు ప్రధాని రోడ్‌షో చేయనున్నారు. 

అయోధ్య : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న ఆలయంలో బాలరాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు మూడు వారాల ముందు శనివారంనాడు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. టెంపుల్ టౌన్ లో మూడు గంటలపాటు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్‌ను ప్రారంభించనున్నారు. 

ఈ నేపథ్యంలో శనివారం జరిగే కార్యక్రమాలను మహా సంప్రోక్షణ వేడుకలకు రిహార్సల్‌గా పరిగణించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్యకు వెళ్లాల్సి ఉంది. కానీ తీవ్రమైన పొగమంచు కారణంగా వెళ్లలేకపోయారు. దీంతో విర్చువల్ గా అయోధ్యలో జరుగుతున్న సన్నాహాలను పరిశీలించారు. 

Latest Videos

Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ

గురువారం వాయిదా పడిన పర్యటనను శుక్రవారం కొనసాగించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌లలో చివరి నిమిషంలో జరగాల్సిన పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ఆయన స్వయంగా పరిశీలించారు. శనివారం ఉదయం ప్రధానికి స్వాగతం పలికేందుకు రాత్రి అయోధ్యలోనే యోగి ఆదిత్యనాథ్ గడిపారు.

ఇక శనివారం ఉదయం 10 గంటలకు ప్రధాని అయోధ్యలోని విమానాశ్రయంలో దిగే అవకాశం ఉంది, ఆ తర్వాత ఆయన అయోధ్య ధామ్ జంక్షన్‌కు వెళతారు. అక్కడ అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను పరిశీలించి, ప్రారంభిస్తారు. విమానాశ్రయం నుండి రైల్వే స్టేషన్ వరకు ప్రధాని రోడ్‌షో చేయనున్నారు. అయోధ్య ప్రజల శుభాకాంక్షలను స్వీకరిస్తారు.

ఇటీవల పునరాభివృద్ధి చేసిన రామ్‌పాత్‌కు ఇరువైపులా తాత్కాలిక చెక్క బారికేడ్‌లు,విమానాశ్రయం నుండి రైల్వే స్టేషన్ వరకు ప్రధానమంత్రి ప్రయాణించే మార్గంలో వచ్చే ఇతర రహదారులను ఏర్పాటు చేసే పనిని పరిపాలన గురువారం ప్రారంభించింది. ప్రధానమంత్రి విమానాశ్రయానికి తిరిగి వచ్చి, కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ర్యాలీలో ప్రసంగిస్తారు.

 రూ. 15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఇందులో రూ.11,100 కోట్ల ప్రాజెక్టులు అయోధ్యలో పౌర సదుపాయాలను పునరుద్ధరించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించబడ్డాయి. మిగిలిన ప్రాజెక్టులు రాష్ట్రానికి సంబంధించినవి. రెండు కొత్త అమృత్ భారత్, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు.

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య దాదాపు గంటసేపు జరిగే ఈ ర్యాలీకి దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని, ఆ తర్వాత ప్రధాని అయోధ్య నుంచి బయలుదేరుతారని సమాచారం.

click me!