Earthquake: మణిపూర్‌లో భూకంపం .. బయటకు పరుగులు తీసిన జనం

By Rajesh KarampooriFirst Published Dec 30, 2023, 12:06 AM IST
Highlights

Earthquake: మణిపూర్ లో  భూకంపం సంభవించింది. ఉఖ్రుల్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. 

Earthquake: మణిపూర్‌లో భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం.. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు తూర్పున 38 కిలోమీటర్ల దూరంలో ఉఖ్రుల్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 22:01 గంటలకు 120కి.మీ లోతులో భూకంపం సంభవించింది.

అయితే.. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. భూకంప కేంద్రం మణిపూర్‌లోని ఉఖ్రుల్ లో నమోదైంది. భూకంపం కారణంగా జనంలో భయాందోళనలు నెలకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Latest Videos

మణిపూర్‌లో వారం రోజుల క్రితం కూడా భూకంపం సంభవించింది. డిసెంబర్ 10న 33 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది.  అయితే, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్లు అంచనా .

click me!