Photoshoot: స్టూడెంట్ తో మహిళ టీచర్ రొమాంటిక్ ఫొటో షూట్.. కిస్సులు, హంగులు ఇస్తూ పోజులు.. నెట్టింట్లో వైరల్ 

Published : Dec 30, 2023, 06:12 AM IST
Photoshoot: స్టూడెంట్ తో మహిళ టీచర్ రొమాంటిక్ ఫొటో షూట్.. కిస్సులు, హంగులు ఇస్తూ పోజులు.. నెట్టింట్లో వైరల్ 

సారాంశం

Romantic Photoshoot: ఒక్కోసారి ఫన్నీ, వివాదాస్పదంగానూ ఉండే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. దీంతో కొంత మంది నెట్టిజన్లు  ఇంటర్నెట్‌లో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ అందులో ఏముంది

ఇది టెక్ యుగం.. ఏ విషయమైనా  క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఓ రొమాంటిక్ ఫోటో షూట్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఇటీవలి కాలంలో ఫోటోషూట్ లు కామనే,, అందులో ప్రత్యేకత ఉంది. అంతగా నెట్టింట్లో వైరల్ కావడానికి కారణమేంటని అనుకుంటున్నారా? ఈ ఫోటో షూట్ లో ఉన్నది అమ్మాయి, అబ్బాయి లేదా అలుమగలు అయితే.. ఇది అంతా కామనేలే భావిస్తాం.. కానీ, ఈ ఫోటో షూట్ లో  ఓ మహిళా టీచర్, ఓ విద్యార్థి అత్యంత సన్నిహితంగా (రొమాంటిక్) ఉండటం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

వీరికి  సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. విద్యాబుద్దులు నేర్పించే ఓ ఉపాధ్యాయురాలు తన కొడుకు వయస్సు ఉన్న విద్యార్థితో అత్యంత నీచంగా ఫోటోలు దిగడమేంటని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదంద్రులు కూడా ఆ మహిళా టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ జిగుప్సాకారమైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.  ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ రొమాంటిక్ ఫోటోషూట్ ఉన్న మహిళా టీచర్‌ను కర్ణాటకలోని చింతామణి తాలూకాలోని మురుగమల్లా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా గుర్తించారు. అందులో ఉన్న విద్యార్థిని అదే పాఠశాలకు చెందిన పదో తరగతి బాలుడిగా గుర్తించారు. స్టడీ టూర్‌‌కు వెళ్లిన సమయంలో ఆ ఉపాధ్యాయురాలు.. పదో తరగతి బాలుడితో ఫోటోలు దిగినట్టుగా పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.  

 ఫొటోలు చూస్తే.. విద్యార్థి కుర్తా, జీన్స్ ధరించిన ఉన్నాడు. మహిళా టీచర్ చీరలో ఉంది. విద్యార్థి మహిళా టీచర్‌కు ముద్దులు పెట్టడం.. ఆమెను ఎత్తడం, ఆమె చీరను లాగడంతో పాటు అత్యంత సన్నిహితంగా ప్రవర్తించాడు. విద్యార్థి మహిళా టీచర్‌కు ముద్దులు పెట్టడం.. ఆమెను ఎత్తడం, ఆమె చీరను లాగడంతో పాటు అత్యంత సన్నిహితంగా ప్రవర్తించాడు. ఆమె కూడా అతనికి ముద్దులు పెట్టింది. మహిళా టీచర్, మగ విద్యార్థి మధ్య శృంగారభరిత సన్నివేశాన్ని పోలిన ఈ ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో విద్యార్థి తల్లిదండ్రులు, పాఠశాలలో చదవుతున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా దిగ్బ్రాంతి చెందారు.

ఈ ఘటనపై వెంటనే మహిళా టీచర్‌ను చర్యలను ప్రశ్నించారు. ఈ ఘటనపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. టీచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి విద్యాశాఖ అదికారులు.. విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గానూ మహిళా టీచర్‌ను సస్పెండ్ చేసింది. 

మరోవైపు.. ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ సమాజం ఎటు పోతుందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా టీచర్‌ ప్రవర్తను తీవ్రంగా తప్పుపడుతున్నారు. టీచర్‌ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal