కోలుకున్న ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ.. త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ - గుజరాత్ ప్రభుత్వం

By team teluguFirst Published Dec 29, 2022, 12:01 PM IST
Highlights

అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చేరిన ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ కోలుకున్నారు. త్వరలోనే ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. 

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ఒకటి రెండు రోజుల్లో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ‘‘హీరాబెన్ ఆరోగ్యం బాగానే ఉంది. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఓరల్ డైట్ ప్రారంభించబడింది’’ అని గుజారత్ సీఎంవో ఆఫీసు నుంచి సమాచారం వచ్చిందని ‘జీ న్యూస్’ నివేదించింది.

బెంగళూరు విమానాశ్రయంలో ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు శాంపిళ్లు

హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను బుధవారం ఉదయం అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో బుధవారం చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఆమెను సాయంత్రం పరామర్శించారు. దాదాపు గంటన్నర సేపు తన తల్లి, సోదరులతో గడిపిన ప్రధాని.. ఆమె ఆరోగ్య సమస్యలతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై వైద్యులతో చర్చించారు.

జనవరిలో కోవిడ్ ఉధృతి.. రాబోయే 40 రోజులు కీలకం - కరోనా వేవ్ పై ప్రభుత్వ అంచనా

హీరాబెన్ వేగంగా కోలుకుంటున్నారని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ప్రధాని మోడీ హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బీజేపీ రాజ్యసభ సభ్యుడు జుగల్‌జీ లోఖండ్‌వాలా మీడియాకు తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆమెను మొదట గాంధీనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి రెఫర్ చేశారు.

కోవిడ్ పాజిటివ్ గా తేలిన అర్జెంటీనా టూరిస్ట్ మిస్సింగ్... తాజ్ మహల్ చూడడానికి వచ్చి...

కాగా.. ప్రధాని తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. తల్లీ కొడుకుల మధ్య ఉండే ప్రేమ శాశ్వతమైనదని, అమూల్యమైనదని, ఈ కష్ట సమయంలో తాను మోడీకి మద్దతుగా ఉంటానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు. హీరాబెన్ త్వరగా కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు.

click me!