జార్ఖండ్‌ నటి రియా కుమారి హత్య కేసులో భర్త అరెస్ట్..!

By SumaBala BukkaFirst Published Dec 29, 2022, 11:53 AM IST
Highlights

జార్ఖండ్‌కి చెందిన ప్రముఖ సినీ నటి రియా కుమారి హత్య కేసులో పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. 

పశ్చిమ బెంగాల్‌ : జార్ఖండ్‌కి చెందిన ప్రముఖ సినీ నటి రియా కుమారిని పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో బుధవారం తెల్లవారుజామున కాల్చి చంపబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జార్ఖండ్‌కు చెందిన నటి ఇషా అలియా భర్తను పోలీసులు అరెస్టు చేశారు. తమ మూడేళ్ల కుమార్తెతో కలిసి రాంచీ నుంచి కోల్‌కతాకు వెళుతుండగా హైవేలో దుండగులు అలియాను కాల్చి చంపారని భర్త ప్రకాష్ కుమార్ మొదట పేర్కొన్నాడు. అతడిని ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.

ఉదయం 6 గంటల సమయంలో టాయ్ లెట్ కు వెళ్లడానికి నిర్జన ప్రదేశంలో కారును ఆపినప్పుడు ముగ్గురు వ్యక్తులు తమను దోచుకోవడానికి ప్రయత్నించారని కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి "ఆలియా ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. దీంతో ఆమె పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

దొంగల చేతిలో జార్ఖండ్‌ నటి హతం.. చోరీని ప్రతిఘటించడంతో కాల్పులు!

కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డిటెక్టివ్స్ కూడా కుమార్‌ని ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా.. ఆ రోజు సాయంత్రం.. సీన్ కన్ స్ట్రక్షన్ లో భాగంగా అతడిని క్రైమ్ స్పాట్‌కు తీసుకెళ్లారు. మొదటి నుంచి పోలీసులు ఈ కేసులో ఏదో తప్పుదారి పట్టించే చర్యగా అనుమానిస్తున్నారు. 

బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. తరువాత భర్త ప్రకాష్ కుమార్ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతని తీరును అనుమానించారు. ప్రకాష్ కథనం ప్రకారం బుధవారం ఉదయం 6 గంటలకు రాంచీ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా హౌరా జిల్లా ఉలుబెరియా సబ్ డివిజన్ పరిధిలోని బగ్నాన్ వద్ద మహిశ్రేఖ వంతెన దగ్గర తన వాహనాన్ని ఆపి యూరిన్ కి వెళ్లిన సమయంలో హత్య జరిగినట్లు చెప్పాడు.

అయితే,  దర్యాప్తు అధికారులకు ఇందులో తిరకాసు కనిపించింది.. అనుమానాలు రేకెత్తించింది. "మహిశ్రేఖ వంతెన సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ప్రకాష్ కుమార్ తన వాహనాన్ని ఆపుతారని దుర్మార్గులకు ఎలా తెలిసింది అనేది మొదటి ప్రశ్న. ఆ సందర్భంలో ప్రకాష్ కుమార్‌ వాహనాన్ని దుండగులు వెంబడించారా? అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అదే రెండవ ప్రశ్న. . మూడవ ప్రశ్న ఏమిటంటే, ప్రకాష్ కుమార్ కారును ఆపినట్లు పేర్కొన్న పాయింట్, నిర్జనంగా ఉన్నప్పటికీ  కాసేపటి కోసమైనా.. పార్కింగ్‌ చేయడానికి అనువైన ప్రదేశం కాదు," అని వర్గాలు తెలిపాయి. "అతను నిజం చెప్పే అవకాశం ఉంది. అతను చెప్పిన సంఘటనల క్రమం అనుమానితంగా ఉంది.. అని పేర్కొన్నారు. 

click me!