జగన్ కు సాయపడం కంటే.. అలా చేస్తే బాగుండేది.. ప్రశాంత్ కిశోర్

By SumaBala BukkaFirst Published Oct 31, 2022, 10:00 AM IST
Highlights

వైఎస్ జగన్, నితీష్ కుమార్ లాంటి ముఖ్యమంత్రులు సాయపడడంకంటే తాను కాంగ్రెస్ పునరుజ్జీవానికి సాయమడితే బాగుండేదని ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బీహార్ : ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటివారు తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు తాను సాయి పడడం కన్నా..  కాంగ్రెస్ పునరుజ్జీవానికి కృషి చేసి ఉంటే బాగుండేదని జన సురాజ్ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. అసలైన ‘మహాత్మా గాంధీ కాంగ్రెస్’కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమనేది తనకు చాలా ఆలస్యంగా అర్థమైంది అని చెప్పారు. 

బీహార్లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే..  ఆదివారం పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని కమలదళం విజయయాత్రను అడ్డుకోవడంలో విపక్షాల కూటమి సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీని అర్థం చేసుకోలేనిదే ఆ పార్టీని ఓడించలేరని విశ్లేషించారు.  కాంగ్రెస్ ను ఉద్దేశించి  ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఓ కప్పులో పైపైన ఉండే నురుగు బిజెపి అయితే దాని కింద ఉండే అసలైన కాఫీయే ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ ( ఆర్ఎస్ఎస్) అని వ్యాఖ్యానించారు. సామాజిక వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ భాగమైపోయిందనీ, షార్ట్ కట్స్ తో దాన్ని ఓడించలేరని చెప్పారు.

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్డి ప్రమాదం.. ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందకుండానే సందర్శకుల అనుమతి..

నితీశ్ తో కటీఫ్ అందుకే…
నితీష్ కుమార్ పైనా ప్రశాంత్ కిషోర్ విమర్శల దాడి కొనసాగించారు. ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జెడియు ఎంపీలు పార్లమెంటులో అనుకూలంగా ఓటేశారని తెలిసి చాలా బాధపడ్డాను. నితీశ్ ను నిలదీశాను. బీహార్ లో ఎన్ఆర్సి అమలు  కానివ్వనని హామీ ఇచ్చారు. రెండు నాలుకల ధోరణి చూసాకే ఆయనతో కలిసి పని చేయలేనని నాకు అర్థమైంది అని చెప్పారు.

click me!