జైట్లీ భార్యాకొడుకులతో మాట్లాడిన మోడీ: మిస్సవుతున్నా...

By telugu teamFirst Published Aug 24, 2019, 1:56 PM IST
Highlights

అరుణ్ జైట్లీ మృతికి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీని రాజకీయ దిగ్గజంగా, మహా మేధావిగా, అద్భుతమైన న్యాయ నిపుణుడిగా మోడీ అభివర్ణించారు. 

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ భార్యతోనూ కుమారుడితోనూ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనను రద్దు చేసుకోవద్దని జైట్లీ కుటుంబ సభ్యులు మోడీకి సూచించారు. 

అరుణ్ జైట్లీ మృతికి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీని రాజకీయ దిగ్గజంగా, మహా మేధావిగా, అద్భుతమైన న్యాయ నిపుణుడిగా మోడీ అభివర్ణించారు. భారతదేశానికి జైట్లీ అద్భుతమైన మరుపురాని సేవలు అందించారని ఆయన అన్నారు. 

జైట్లీ మరణం తనను తీవ్ర విచారానికి గురి చేసిందని మోడీ అన్నారు. తాను జైట్లీ సంగీతతోనూ కుమారుడు రోహన్ తోనూ మాట్లాడి సంతాపం తెలియజేశానని ఆయన అన్నారు. 

చమత్కారాలతో, అద్భుతమైన హాస్యచతురతతో, చరిష్మాతో అరుణ్ జైట్లీ జీవితం యావత్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మనసులను దోచుకున్నారని మోడీ అన్నారు. జైట్లీని ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడారు. భారత రాజ్యాంగంపై, ప్రభుత్వ విధానాలపై, పరిపాలనపై జైట్లీకి విశేషమైన జ్ఞానసంపద ఉందని ఆయన అన్నారు. 

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో జైట్లీ పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలను చేపట్టారని, తద్వారా భారత ఆర్థికాభివృద్ధికి, రక్షణ సామర్థ్యాల పటిష్టతకు, ప్రజానుకూల చట్టాల రూపకల్పనకు, విదేశాలతో వాణిజ్యాభివృద్ధికి ఎనలేని సేవలందించారని ఆయన అన్నారు. 

బిజెపికి, జైట్లీకి మధ్య విడదీయలేని బంధం ఉందని ఆయన అన్నారు ఆవేశపరుడైన విద్యార్థిగా అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుండి పోరాటం చేశారని అన్నారు. 

జైట్లీ మృతితో తాను అమూల్యమైన మిత్రుడిని కోల్పోయానని ఆయన అన్నారు. జైట్లీ జీవితం అద్భుతంగా గడిచిందని, ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను వదిలివెళ్లారని, జైట్లీని మిస్సవుతున్నానని మోడీ అన్నారు.  

సంబంధిత వార్తలు

దేశ ఆర్థిక వ్యవస్థను చీకటి నుంచి బయటపడేసిన వ్యక్తి జైట్లీ.. రాజ్ నాథ్ సింగ్

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

click me!