అసోంలో మోడీ టూర్: కజిరంగ నేషనల్ పార్క్‌లో ఏనుగు సవారీ చేసిన ప్రధాని (వీడియో)

By narsimha lodeFirst Published Mar 9, 2024, 8:31 AM IST
Highlights


  అసోం  రాష్ట్రంలోని కజరంగలో  ఏనుగు సవారీ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు  అసోంలోని కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించారు. కజిరంగ నేషనల్ పార్క్ లో  ఏనుగు సవారీ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.  యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ను మోడీ ఇవాళ సందర్శించారు. మొదట పార్క్ లోని సెంట్రల్ కోహురా రేంజ్ లోని మిహిము ప్రాంతంలో  ఏనుగు సఫారీ చేశారు మోడీ. 

also read:టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు?: సీట్ల సర్దుబాటుపై చర్చలు

 

Visuals of Hon’ble Prime Minister Shri undertaking a safari at Kaziranga National Park this morning. pic.twitter.com/spGXogfbYg

— Chief Minister Assam (@CMOfficeAssam)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెంట పార్క్ డైరెక్టర్  సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీశాఖాధికారులున్నారు.  ఈశాన్య ప్రాంతంలో రెండు రోజుల పర్యటన కోసం  మోడీ  శుక్రవారంనాడు సాయంత్రం కజిరంగకు చేరుకున్నారు.

also read:లంచం ఇవ్వాల్సిందే: రెవిన్యూ సిబ్బంది లంచం అడిగారని ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో

రెండు గంటల పాటు ఈ పార్క్ లో మోడీ గడిపారు. 1974 తర్వాత కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించిన మొదటి ప్రధానమంత్రి మోడీ.
ఇవాళ మధ్యాహ్నం జోర్హాట్ లో లెజెండరీ అహోమ్ జనరల్ లచిత్ బర్పుకాన్ 125 అడుగుల శౌర్య విగ్రహన్ని మోడీ ప్రారంభిస్తారు.ప్రధాన మంత్రి మోడీ జోర్హాట్ జిల్లాలోని మెలెంగ్ మెటెలిపోతార్ కు వెళ్తారు. సుమారు రూ. 18 వేల కోట్ల విలువైన పలు ప్రాజక్టులను ప్రారంభిస్తారు.
 

click me!