మాయావతి: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

By Rajesh Karampoori  |  First Published Mar 9, 2024, 3:28 AM IST

Mayawati Biography: బహుజనుల ముద్దు బిడ్డ. ఫైర్ బ్రాండ్ మాయావతి. ఈ పేరు దేశ రాజకీయాలలో సంచలనం ముఖ్యమంత్రిగా, బీఎస్సీ  పార్టీ అధ్యక్షురాలుగా,  బహుజన ప్రచారకర్తగా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఆమె తీసుకున్న సంచలన నిర్ణయాలు వివాదాలుగా అంతకంటే ఎక్కువ ఘనతలు మనకు కనిపిస్తాయి.


Mayawati Biography: ఉత్తరప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయనం మాయావతి. బహుజన సమాజ్ వాదీ పార్టీ(BSP) అధినాయకురాలు. ఆమె ఉత్తరప్రదేశ్‌కు  మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఆమె ఈ పదవిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సాధించి తన పేరిట చరిత్ర క్రియేట్ చేసుకున్నారు.  మాయావతి రాజకీయాలు కేవలం ఉత్తరప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో సుపరిచితమైన పేరు. ఆమె వెనుకబడిన కులాల రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పార్టీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఆమె అనేక సార్లు లోక్‌సభ సభ్యురాలుగా, రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైనప్పటికీ 2018లో ఆమె రాజ్యసభకు రాజీనామా చేశారు. 

మాయావతి బాల్యం, కుటుంబం

Latest Videos

undefined

మాయావతి జనవరి 15, 1956న దేశ రాజధాని ఢిల్లీలోని శ్రీమతి సుచేతా కృపలానీ ఆసుపత్రిలో జన్మించారు. ఆమె తండ్రి పేరు ప్రభుదాస్,  తల్లి పేరు రామరాతి. ఆమె తండ్రి ప్రభుదాస్ గౌతమ్ బుద్ధ నగర్‌లోని బాదల్‌పూర్ ప్రాంతంలోని పోస్టాఫీసులో సీనియర్ క్లర్క్‌గా పనిచేసేవారు. మాయావతికి 6 మంది సోదరులు, 2 సోదరీమణులు. తల్లిదండ్రులు తమ పిల్లలందరి చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టారు. మాయావతి పెళ్లి చేసుకోలేదు. ఆమె అవివాహితురాలు. మాయావతి కుటుంబం హిందువులు. మాయావతి జాతవ్ కులానికి చెందినవారు.

మాయావతి విద్య

మాయావతి ప్రాథమిక విద్య ఆమె సొంత నగరానికి సమీపంలోనే జరిగింది. ఆ తరువాత.. ఆమె 1975లో ఢిల్లీలోని కాళింది మహిళా కళాశాలలో బీఏ చేసింది. ఆ తరువాత 1976లో ఘజియాబాద్‌లోని మీరట్ విశ్వవిద్యాలయంలోని బిఎమ్‌ఎల్‌జి కళాశాల నుండి బి.ఎడ్ , 1983లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బి చేశారు. ఆమె ఢిల్లీలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా మారింది. టీచర్‌గా పనిచేస్తూనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)కి ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది.

 రాజకీయ జీవితం 

మాయావతి రాజకీయ ప్రయాణం చాలా ఆసక్తిరకంగా ఉంటుంది. మాయావతి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా కూడా పనిచేసింది. ఆ రోజుల్లో అప్పటి దళిత నాయకుడు కాన్షీరామ్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారని, ఆ తర్వాత మాయావతి తన మార్గాన్ని బోధన నుండి రాజకీయాలకు మార్చుకున్నారని చెబుతారు. మాయావతి టీచర్‌ నుంచి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు సాగిన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది.
 
మామావతి జీవితంలో ప్రతిదీ సాధారణంగానే ఉంటుంది,  కాన్షీరామ్‌తో భేటీ తర్వాత మాయావతి రాజకీయ ప్రయాణం మొదలైంది. అంతకు ముందు ఆమె రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకోలేదు. కానీ, కాన్షీరామ్ ఆమెను కలిసినప్పుడు ఆము తన కెరీర్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలడని ఒప్పించడంలో విజయం సాధించాడు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె అలా 1984లో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 


 
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ సభ్యునిగా, లోక్ సభ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. మాయావతి దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు. 2018లో మాయావతి ఆగ్రహంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. ప్రస్తుతం మాయావతి ఏ పదవిలో లేకపోయినా ఆమె పార్టీ అధినేత్రిగా కొనసాగుతున్నారు.

1984 - టీచర్ ఉద్యోగాన్ని వదిలి, రాజకీయాల్లో అడుగుపెట్టారు. బహుజన్ సమాజ్ పార్టీ (BSP)ని స్థాపించారు.
1996-98 - ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యుడు.
1989 - లోక్‌సభ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకోవడం ద్వారా దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1989 - మాయావతి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి ఎంపీ అయ్యారు.
1995 - మాయావతి కొంతకాలం పాటు మొదటిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
1997 - మాయావతి రెండవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
1999 - పదమూడవ లోక్‌సభలో విజయం సాధించడం ద్వారా మాయావతి అక్బర్‌పూర్ నుంచి ఎంపీ అయ్యారు.
1994 - మాయావతి ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
2001 - కాన్షీరామ్ వారసురాలిగా మాయావతిని ప్రకటించారు.
2002 – మాయావతి ఉత్తర ప్రదేశ్, శాసనసభకు ఎన్నికయ్యారు.
2002 - మాయావతి మూడవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
2003 - మాయావతి BSP జాతీయ అధ్యక్షురాలు అయ్యారు.
2004 - పద్నాలుగో లోక్‌సభలో విజయం సాధించడం ద్వారా మాయావతి మళ్లీ అక్బర్‌పూర్ నుంచి ఎంపీ అయ్యారు.
జూలై 2004 – కానీ కొంత కాలం తర్వాత, ఆమె లోక్ సభకు రాజీనామా చేసి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయబడింది.
2007 - మాయావతి నాల్గవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.


యూపీ ముఖ్యమంత్రిగా మాయావతి పదవీకాలం  

మొదటి సారి-  జూన్ 3, 1995 నుండి అక్టోబర్ 18, 1995 వరకు
రెండవ సారి - మార్చి 21, 1997 నుండి సెప్టెంబర్ 20, 1997 వరకు
మూడవ సారి - మే 3, 2002 నుండి ఆగస్టు 26, 2003 వరకు
నాలుగ సారి - మే 13, 2007 నుండి మార్చి 6, 2012 వరకు

మాయావతి విజయాలు 

  • 2003లో మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలియో నిర్మూలనలో ఆమె చేసిన మంచి కార్యక్రమాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పాల్ హారిస్ ఫెలో అవార్డును అందించింది.
  • మాయావతికి రాజర్షి షాహూ మెమోరియల్ ట్రస్ట్ రాజర్షి షాహూ అవార్డును అందించింది.
  • టైమ్ మ్యాగజైన్ 2007కి మాయావతిని భారతదేశంలోని టాప్ 15 ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.
  • ఫోర్బ్స్ మ్యాగజైన్ 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో మాయావతికి 59వ స్థానం ఇచ్చింది.


మాయావతి ప్రొఫైల్ 

  • పేరు: మాయావతి
  • వయస్సు: 67 సంవత్సరాలు
  • పుట్టిన తేదీ: జనవరి 15, 1956
  • పుట్టిన ప్రదేశం:  న్యూఢిల్లీ
  • విద్యార్హత: B.Ed, LLB
  • రాజకీయ పార్టీ: బహుజన సమాజ్ పార్టీ
  • ప్రస్తుత స్థానం: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత, ఎంపీ
  • వైవాహిక స్థితి: అవివాహితురాలు
  • తండ్రి: ప్రభుదాస్
  • తల్లి: రామరతి
  • తమ్ముడి పేరు:  ఆనంద్ కుమార్
  • శాశ్వత చిరునామా: కోఠి నం. 13A, మాల్ అవెన్యూ, లక్నో, ఉత్తరప్రదేశ్
click me!