దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోల్‌కత్తాలో అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రారంభించారు. అనంతరం అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మెట్రో రైలులో విద్యార్థులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయాణించారు. దేశంలోనే నది అడుగున ఏర్పాటు చేసిన తొలి మెట్రో రైలు మార్గం ఇదే.
also read:అద్భుతం: హుగ్లీ నది దిగువన మెట్రో రైలు సేవలు
undefined
మెట్రో రైలులో తన పక్కన కూర్చున్న విద్యార్థులతో మోడీ సంభాషించారు. మెట్రో రైలులో మోడీతో కలిసి ప్రయాణించడం ఎంతో సంతోషంగా ఉందని మెట్రో రైలులో ప్రయాణించడానికి ముందే పగ్యా అనే విద్యార్ధి మీడియాకు చెప్పారు.కోల్‌కత్తా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ కింద రూ. 120 కోట్లతో ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. హుగ్లీ నదికి దిగువన దీన్ని నిర్మించారు.
also read:స్కార్పియో వాహనంలో 18 ప్రయాణం: ఇంటర్నెట్‌లో వైరలైన వీడియో
: PM interacts with school students as he travels with them in India's first underwater metro train in . pic.twitter.com/75rA3fVb0x
— DD News (@DDNewslive)హుగ్లీ నది కింద హౌరా మైదాన్-ఎన్‌ప్లనేడ్ లను కలుపుతూ 4.8 కి.మీ. మేర ఈ గ్రీన్ లైన్ ను నిర్మించారు. ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో
53 ఏళ్ల కోల్‌కత్తా వాసుల కలను నెరవేరనుంది.
also read:మలివిడత జాబితా: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు
హుగ్లీ కింద ఏర్పాటు చేసిన సొరంగం తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్ ప్రాజెక్టులో ఒక భాగం. ఇది సాల్ట్ లేక్ లోని సెక్టార్ ఐదు నుండి ప్రారంభమై సీల్దా వద్ద ముగుస్తుంది. మొత్తం 16.6 కి.మీ.లలో 10.8 కి.మీ. భూగర్భంలోనే రైలు మార్గం ఉంటుంది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 2008లో మంజూరయ్యాయి.ఈ రైలు మార్గంతో ట్రాఫిక్ రద్దీ కూడ తగ్గనుంది.